Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు


గౌస్‌ పార్థీవదేహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి ఎర్రబెల్లి

ఎల్బీనగర్‌, కొత్తూరు(రాయపర్తి), న్యూస్‌టుడే: వరంగల్‌ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరుకు చెందిన ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ.గౌస్‌ సోమవారం మృతి చెందారు. మంగళవారం వరంగల్‌ నగరంలో గౌస్‌ కుటుంబసభ్యులను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. గౌస్‌ పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. స్వగ్రామం కొత్తూరులో పార్టీ శ్రేణులు, గ్రామస్థులు, అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కుమార్‌గౌడ్‌, సుధీర్‌రెడ్డి, బహుజన కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు సాంబయ్య, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని