1908 వరద మృతులకు నివాళులు
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

1908 వరద మృతులకు నివాళులు

మాట్లాడుతున్న వేదకుమార్‌

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలోని చింత చెట్టును స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఫోరం ఫర్‌ ఏ బెటర్‌ హైదరాబాద్‌ ఛైర్మన్‌ ఎం.వేదకుమార్‌ పిలుపునిచ్చారు. 1908 మూసీ వరదల సమయంలో ఆ చెట్టు పైకెక్కి 150 మంది ప్రాణాలు దక్కించుకున్నారని గుర్తు చేశారు. మంగళవారం ఫోరం ఫర్‌ ఏ బెటర్‌ హైదరాబాద్‌, సెంటర్‌ ఫర్‌ దక్కన్‌ స్టడీస్‌, దక్కన్‌ హెరిటేజ్‌, దక్కన్‌ అకాడమీల భాగస్వామ్యంతో చింతచెట్టు కింద స్మారక సమావేశం ఏర్పాటు చేసి, మూసీ వరదల్లో మృతులకు నివాళులర్పించారు. అనంతరం చింతచెట్టు ఆవరణలో మొక్కలు నాటారు. నాటి వరదల సమయంలో తీసిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని