వినూత్న ఆవిష్కరణలు.. విజ్ఞాన వీచికలు - Kamareddy - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

వినూత్న ఆవిష్కరణలు.. విజ్ఞాన వీచికలు

కంజర్‌ గురుకులంలో ముగిసిన వైజ్ఞానిక ప్రదర్శన

కంజర్‌(మోపాల్‌), న్యూస్‌టుడే: మోపాల్‌ మండలం కంజర్‌ శివారులోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకులంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తోంది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది బీసీ గురుకులాల విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించారు. శుక్రవారంతో ప్రదర్శన ముగిసింది.


విద్యుత్తు ఆదా.. సాగు నీటికి భరోసా

విద్యుత్తు ఆదాచేస్తూ సాగు, తాగునీటి కష్టాలను దూరం చేసే సోలార్‌ పవర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును దోమకొండ గురుకులంలో ఏడో తరగతి చదువుతున్న వర్ధన్‌, రాము అనే ఇద్దరు విద్యార్థులు రూపొందించారు. పొలంలో సోలార్‌ ప్యానల్‌ను ఏర్పాటు చేసుకొని విద్యుత్తు మోటార్లను వినియోగించుకోవాలి. నీళ్లు నేరుగా పొలంలోకి వెళ్లకుండా సమీపంలో ఒక ట్యాంకు నిర్మించుకోవాలి. ఆ నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో వ్యర్థజలాలను పొలాలకు, తాగునీటికి ఇళ్లకు సరఫరా చేయవచ్ఛు


ఇంధనాలతో పనిలేదు..కాలుష్యం జాడలేదు

సౌరశక్తి సాయంతో వాహనాలు నడిచే ప్రాజెక్టును నూత్‌పల్లి గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్న సాయితేజ, కార్తీక్‌లు రూపొందించారు. వాహనాల పైభాగంలో సోలార్‌ ప్యానల్స్‌ అమర్చాలి. సౌరశక్తి సాయంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాహనాల అంతర్భాగంలో బిగించిన డీసీ మోటార్లలో నిల్వ చేయాలి. దీన్ని ఇంజిన్‌కు అనుసంధానం చేయడంతో సౌర విద్యుత్తు శక్తితో వాహనాలు పని చేస్తాయి. ఇంధన వినియోగం లేకపోవడంతో గాలి కాలుష్యానికి తావుండదు.


కలుషిత జలానికి కొత్తరూపం

పరిశ్రమలు, మురుగు కాలువల నుంచి వచ్చే కలుషిత నీటిని శుద్ధి చేసి వినియోగంలోకి తీసుకొచ్చే ప్రాజెక్టును ఎడపల్లి గురుకులానికి చెందిన వేణుగోపాల్‌, జైత్‌రామ్‌ అనే ఇద్దరు విద్యార్థులు రూపొందించారు. ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసే బార్‌స్క్రీన్‌, సాండ్‌అండ్‌గ్రిట్‌, స్కిమ్మర్‌అండ్‌స్క్రాపర్‌, సపరేషన్‌ ఛాంబర్‌ అనే పేర్లతో ఏర్పాటు చేసే ట్యాంకుల్లోకి కలుషిత నీటిని తరలిస్తారు. ఇందులోని ప్రత్యేక పరికరాలు వ్యర్థాలను వేరు చేస్తాయి. చివరిగా నీటిని కోట్లరినేషన్‌ చేయడంతో శుద్ధజలంగా మారుతోంది.


హైడ్రాలిక్‌ వంతెన..

సముద్రాలు, నదులపై పడవలు ప్రయాణించడానికి వీలుగా హైడ్రాలిక్‌ వంతెనను కామారెడ్డి జిల్లా ఎర్రపహాడ్‌ గురుకులంకు చెందిన విజయేందర్‌, సందీప్‌లు తయారుచేశారు. సముద్రాలు, నదులపై సిమెంటుతో కాకుండా స్టీలు, ఇనుము సంబంధిత ముడి సరకులతో వంతెనలు నిర్మించాలి. దీని మధ్యభాగంలో విచ్చుకునేలా భారీ సామర్థ్యం ఉన్న మోటార్లను ఏర్పాటు చేయాలి. పడవలు వచ్చినప్పుడు వాటి సాయంతో వంతెనను రెండుగా విడదీయవచ్ఛు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.