వృద్ధులతో ఆప్యాయంగా మెలగాలి - Hyderabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

వృద్ధులతో ఆప్యాయంగా మెలగాలి

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, టి.అమర్‌నాథ్‌గౌడ్‌

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: వయోవృద్ధులు సమాజాభివృద్ధికి సలహాలు, సూచనలు అందిస్తూ స్ఫూర్తిగా నిలవాలని హైకోర్టు న్యాయమూర్తి ఎ.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వయోవృద్ధుల పట్ల ప్రజలంతా గౌరవం, ఆప్యాయతతో మెలగాలని సూచించారు. ఆదివారం ఎల్డర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌(ఈసీఐఎఫ్‌) ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. సికింద్రాబాద్‌ సన్‌షైన్‌ ఆసుపత్రిలోని శాంతా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రయ్య, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌, పారిశ్రామికవేత్త జి.రవికుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నో త్యాగాలకోర్చి జీవితమంతా కుటుంబం కోసం పనిచేసిన వారిని వృద్ధాప్యంలో ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారులతో కాలం గడపడానికి ఇదే సరైన సమయమని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలన్నారు.

* న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌ గౌడ్‌ మాట్లాడుతూ వయోవృద్ధుల కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు న్యాయస్ధానాలు కృషి చేస్తున్నాయన్నారు. సీనియర్‌ సిటిజన్ల సేవలను కొనియాడారు. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న సీనియర్‌ సిటిజన్లను అభినందించి ధ్రువపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈసీఐఎఫ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎస్‌.ఆవులప్ప, ప్రతినిధులు మోహన్‌రావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.