close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

వేధింపుల నిరోధానికి పటిష్ఠ వ్యవస్థ అవసరం

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఐటీ సంస్థల్లో మహిళలపై వేధింపులపై ఫిర్యాదులకు పటిష్ఠ వ్యవస్థ ఏర్పాటు అవసరమని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. మాదాపూర్‌ లేమన్‌ ట్రీ హోటల్‌లో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ), యూఎస్‌ కాన్సులేట్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం.. సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు గౌరవప్రదమైన, సురక్షిత పని ప్రదేశాన్ని కల్పించడంపై అవగాహన కల్పించారు. ఎస్‌సీఎస్‌సీ సభ్యులు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఐటీ ఉద్యోగులు సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్‌ మాట్లాడుతూ ఎస్‌సీఎస్‌సీ.. ఐటీ కారిడార్‌, మహిళల భద్రతలో కీలక భూమికను పోషిస్తోందని అన్నారు. పెనిన్సులా మీడియేషన్‌ డైరెక్టర్‌ మెర్రీ హాన్సన్‌ కీలకోపన్యాసం చేస్తూ మహిళలకు సమాన అవకాశాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రగతి సాధిస్తుందని, దేశాలు వృద్ధి సాధించడమేకాక స్త్రీ, పురుష బేధాలు దూరమవుతాయన్నారు. సంస్థల్లోని మానవనరులు, మేనేజ్‌మెంట్‌ అధికారులు పోష్‌ వంటి చట్టాలు, అమలుపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో షీ టీమ్స్‌  డీసీపీ అనసూయ, ఎస్‌ఎస్‌సీ వైస్‌ ఛైర్మన్‌ భరణి ఆరోల్‌, ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల, సంయుక్త కార్యదర్శి ప్రత్యూష శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.