close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

సోనియాకు ఖట్టర్‌ క్షమాపణ చెప్పాలి: గీతారెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వ్యాఖ్యలు అనుచితమని మాజీమంత్రి గీతారెడ్డి మంగళవారం అభ్యంతరం తెలిపారు. ‘సోనియాగాంధీకి మళ్లీ ఏఐసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం కొండను తవ్వి ఎలుకను తీసినట్టుంది’ అని ఖట్టర్‌ అనడం దారుణమని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీకి మహిళల మీద ఉన్న చులకన భావానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని గీతారెడ్డి అన్నారు. సోనియా గాంధీకి ఖట్టర్‌ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

హరియాణా సీఎం ఖట్టర్‌ దిష్టిబొమ్మ దహనం.. సోనియాగాంధీపై మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆధ్వర్యంలో మంగళవారం గాంధీభవన్‌ దగ్గర కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీలో ఇదే క్రమశిక్షణ నేర్పుతున్నారా? అని శారద ప్రశ్నించారు. ఖట్టర్‌ తక్షణం క్షమాపణ చెప్పకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.