close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

రాష్ట్ర వార్తలు

10న జిమ్నాస్టిక్స్‌ ఎంపికలు

ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాస్థాయి జిమ్నాస్టిక్స్‌ ఎంపికలను ఈనెల 10న ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక ఇండోర్‌ మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా జిమ్నాస్టిక్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి ఎండీ కరీముద్దీన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయిలో ఎంపికయ్యే క్రీడాకారులు ఈనెల 15 నుంచి గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులవుతారన్నారు. పూర్తి వివరాలకు 99515 99662 నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.

10న కళా ఉత్సవం

ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఎస్‌సీఈఆర్‌టీ ఉత్తర్వుల మేరకు ఈనెల 10న జిల్లాస్థాయి కళా ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు డీఈవో రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు స్థానిక సెయింట్‌ థెరిసా బాలికోన్నత పాఠశాలలో పలు అంశాల్లో పోటీలుంటాయన్నారు. గాత్ర, వాద్య సంగీతం, నృత్యం, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్థులు హాజరుకావచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.