close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మేడారం

పుర బరి.. ఆశావహుల గురి

వార్డుల్లో విస్తృతంగా పర్యటనలు
పోరుకు ముందే ప్రయత్నాలు

అమ్మా.. నమస్కారం..! బాగున్నారా..? మీ ఇంట్లో ఓట్లు ఉన్నాయో.. లేవో జర చూసుకోండి. మీ వాళ్ల పేర్లు చెప్పండి.! ఈ ఓటర్ల జాబితాలో మేము చూసి పెడతాం. ఈ సారి నేను మన డివిజన్‌ నుంచే పోటీ చేయబోతున్న.. కచ్చితంగా మీ అందరి అభిమానం ఉండాలె.!

అరె తమ్మీ.. ఈ సారి ఎలక్షన్‌లలో మనని కాదని వేరే వాళ్లకు అవకాశం ఉండదు. కుదరితే నాకు లేదంటే మీ వదినకు టికెట్‌ ఖాయం. మన డివిజన్‌ పరిధిలో ఇంటింటికి ముందుగానే మేమిద్దరం తిరుగుతున్నాం.

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

‘ఆలస్యం.. అమృతం.. విషం’.. అందుకేనేమో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఆశావహ నాయకులు ఇలా ముందస్తు వేగాన్ని చూపుతున్నారు. పట్టణాల పరిధిలో త్వరలో ఎన్నికలు జరిగే వీలుండటంతో తమ జోరు క్రమంగా పెంచుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేయాలనే కాంక్షతో ఆరాటం చూపుతున్నారు. ఓ వైపు పార్టీలో నమ్మదగిన నాయకుడిగా అధిష్ఠానం దృష్టిలో పడేలా చూస్తూనే.. మరోవైపు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ దిశగా అవసరమైన కసరత్తు చేస్తున్న తరుణంలో ఆయా స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకులంతా లోలోన తమ ప్రభావం చూపించేలా ప్రజల చెంతకు వెళ్తున్నారు. సిట్టింగ్‌లుగా ఉన్న వారితోపాటు గతంలో పోటీ చేసి ఓడినవారు.. కొత్తగా ఈ సారి బరిలో నిలవాలనుకునే వాళ్ల చూపంతా సమీప భవిష్యత్తులో రానున్న పురపోరుపైనే కేంద్రీకరిస్తున్నారు. ముందస్తు వ్యూహాలతో ఎత్తుగడల్ని అమలు చేస్తున్నారు.

గత అనుభవాలే పాఠంగా..
ఇటీవల వరుస ఎన్నికల దరువులో ప్రజలనుంచి ఎదురైన అనుభవాలు.. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో  గెలిచేందుకు పల్లెల్లో అభ్యర్థులు పడిన పాట్లను.. తక్కువ ఓట్లతో గట్టెక్కిన వైనాన్ని గమనించిన పురనేతలంతా ఈ సారి ముందస్తు ప్రణాళికల్లో తలమునకలవుతున్నారు. పైగా టికెట్‌ ఖరారుకు అన్ని పార్టీలు అభ్యర్థుల గుణగణాలతోపాటు ప్రజలతో ఉన్న సత్సంబంధాన్ని ప్రామాణికంగా పరిగణించడంతో ఎలాగైనా పార్టీల దృష్టిలో పడేలా ఆశావహులంతా ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. ఎందరు బరిలో ఉన్నా తామే ముందుండాలనే తలంపును ఆచరణలో చూపిస్తున్నారు. ప్రజల మద్దతు ఉంటే ఎలాగైనా టికెట్‌ రావడం ఖాయమని ఒక వేళ పార్టీలు ఆదరించకున్నా.. ప్రజల నమ్మకాన్ని చూరగొంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా రంగంలోకి దిగేలా పలువురు వ్యూహరచనల్ని చేస్తున్నారు. ఇప్పటికే ఇంటి నంబర్ల ఆధారంగా డివిజన్‌ల పునర్విభజన ముసాయిదా ప్రకటించడంతో పోటీపై ఆసక్తి ఉన్న వారు అనుకూలమైన వార్డుల దిశగా దృష్టిని మళ్లిస్తున్నారు. రిజర్వేషన్‌లు వెలువడిన తర్వాత అవసరాన్నిబట్టి సమీప వార్డు నుంచైనా పోటీ చేయాలనే సంకల్పంతో ఉంటున్నారు. పనిలోపనిగా ప్రజలను పలకరిస్తూ పరిచయాలతో ముందుకెళ్తున్నారు.

తీవ్రతరమని గుర్తించి : రాజకీయాసక్తి.. పెరగుతున్న పదవి వ్యామోహాల నేపథ్యంలో ఈ సారి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఆశవహుల సంఖ్య అన్ని వార్డులు, డివిజన్లలో కచ్చితంగా పెరిగే వీలుంది. కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఉన్న రెండు నగరపాలక సంస్థల్లోని 110 డివిజన్ల పరిధిలోనే ఈ సారి సుమారు వెయ్యిమంది వరకు నాయకులు పోటీకి ఉత్సుకతను చూపిస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. ఇక కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి, చొప్పదండి, సుల్తానాబాద్‌, మంథని, రాయికల్‌, ధర్మపురిలాంటి పురపాలికల్లోనూ రంగంలో నిలువాలనుకునే వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. పోటీదారులనుంచి ఎదురయ్యే ఇక్కట్లును అధిగమించేలా కొన్నిచోట్ల పార్టీలు అభ్యర్థుల విషయంలో లోలోపల సర్వే చేయించాలనే ఆలోచనతో ఉన్నాయి. దీంతో కుతూహలం ఉన్న నేతలంతా వార్డుల్లు, డివిజన్లలో ప్రజల ముందు నిత్యం ఏదోరకంగా కనిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ గురించి ఓటర్లకు తెలిస్తే ప్రయోజనమనే తీరుతో వారి చెంతకు విరివిగా వెళ్తున్నారు. కొన్ని పట్టణాల్లో తమ పరిధిలోని కొన్ని ఇళ్లను ఒకటి, రెండు సార్లు తిరిగి వచ్చారంటే పరిస్థితి ఎలాగుందనేది తెలుస్తోంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.