close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

అమెరికా పర్యావరణ బృందంతో సీఎండీ భేటీ

గోదావరిఖని, న్యూస్‌టుడే: సింగరేణిలో పర్యావరణ హితంగా చేపడుతున్న బొగ్గు ఉత్పత్తిపై అమెరికన్‌ ప్రాంతీయ పర్యావరణ అధికారుల బృందంతో ఛైర్మన్‌ శ్రీధర్‌ సోమవారం సమావేశమయ్యారు. సింగరేణిలో చేపడుతున్న పర్యావరణ చర్యలను తెలుసుకునేందుకు దక్షిణాసియా దేశాల ప్రాంతీయ పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, ఆరోగ్య విభాగ అధికారిణి సారా లిట్కె ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో వారితో సమావేశమైన ఛైర్మన్‌ పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. లాంగ్‌వాల్‌, సర్ఫేస్‌మైనర్‌, ఇన్‌పిట్‌క్రష్షర్‌, కన్వేయర్‌ బెల్టు విధానాలను అమలు చేయడం ద్వారా పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కోల్‌వాషరీల ద్వారా బొగ్గును శుద్ధి చేసి రవాణా చేస్తున్నామని, మట్టి నుంచి ఇసుక తీసే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. సామాజిక బాధ్యతగా పరిసర గ్రామాల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతూ పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఛైర్మన్‌ చెప్పారు. కాలుష్య కారకాలపై నిరంతర విశ్లేషణ, పర్యవేక్షణ ద్వారా నివారణ చర్యలు సాధ్యమవుతున్నాయని, ఓబీ డంపులపై కృత్రిమ వనాలు పెంచుతున్నామని, ఏటా హరితహారం ద్వారా మొక్కలు నాటుతున్నామని వారికి వివరించారు. ఈ సందర్భంగా సింగరేణి చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని ఆమె వెల్లడించినట్లు యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేస్తున్నానని ఛైర్మన్‌కు తెలిపారు. సారా లిట్కె వెంట అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ వాణిజ్య సలహాదారు అన్నె డిసిల్వా, సింగరేణి జీఎం ఆంథోనిరాజా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.