close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేవారే లేరు: మంత్రి

నల్గొండలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్ఢి చిత్రంలో జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎన్నికల

ఇన్‌ఛార్జి రవీందర్‌రావు, ఎమ్మెల్యే కంచర్ల, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల తదితరులు

నల్గొండ అర్బన్‌: తెలంగాణ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేవారే లేరని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ఆడిటోరియంలో పార్టీ కార్యకర్తలతో ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే భాజపా నాయకులు చెప్పేదంతా డొల్లానేనన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో కార్యకర్తలు అహర్నిశలు కృషిచేసి ఓటరు నమోదు సంఖ్యను పెంచాలని కోరారు. జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యతతో గెలుపునకు కృషిచేయాలన్నారు. రైబస రాష్ట్ర, అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎన్నికల ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మున్సిపల్‌ ఛైర్మన్‌ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

దేవరకొండ: భాజపా పాలిత రాష్ట్రాల్లో చేపట్టని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో 50కి పైగా అమలు పరుస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం దేవరకొండలో ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పట్టభద్రుల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. రైతు బంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.

1.5 లక్షల ఉద్యోగాల భర్తీ: పల్లా

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని, విద్యుత్తు శాఖలో 25 వేల మందిని రెగ్యులర్‌ చేశారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎన్నికల ముందు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతు బంధు జిల్లా అధ్యక్షుడు రాంచంద్రునాయక్‌, పుర ఛైర్మన్‌ నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హత కలిగిన వారిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత కార్యకర్తలదేనని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. నకిరేకల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఓటర్ల నమోదులో నకిరేకల్‌ నియోజకవర్గం వెనకబడిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ అమరుల త్యాగం మరువలేనిది

నల్గొండ అర్బన్‌: పోలీస్‌ అమరుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్లాగ్‌ డే సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించి మాట్లాడారు. సమాజం కోసం ప్రాణత్యాగం చేసినవారందరిని గుర్తించాల్సిన అవసరముందని, శాంతి భద్రతల విషయంలో పోలీసుల పాత్ర కీలకమైందన్నారు. కొవిడ్‌-19 లాంటి వైరస్‌ బారి నుంచి రక్షణతోపాటు ప్రస్తుతం వర్షాలకు అల్లాడుతున్న వారిని కాపాడడంలో పోలీసులు ఎనలేనిసేవలు అందించారని తెలిపారు. కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ముందు వరసలో ఉంటారన్నారు. ఎస్పీ ఏవీ రంగనాథ్‌ మాట్లాడుతూ జిల్లాలో 15 మంది పోలీసులు సంఘవిద్రోహశక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని, కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు అమరవీరుల వారోత్సవాలు ఈ నెల 21 నుంచి 31 వరకు జిల్లాలో నిర్వహించనున్నామన్నారు. అనంతరం పోలీస్‌ అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఏఎస్పీ నర్మద డీఎస్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.