close

గురువారం, అక్టోబర్ 01, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు

ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న తెదేపా నాయకులు 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వ΄డు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అనే నినాదంతో జిల్లా తెదేపా ఆధ్వర్యంలో స్థానిక అద్దంకి బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆ పార్టీ నాయకులు మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర తెదేపా అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు రాజధాని విషయం బయట పెట్టకుండా ఎన్నికలయ్యాకా, ప్రజలతో అవసరం తీరాక, దొంగ చాటుగా రాజధానిని తరలిస్తున్నారని విమర్శించారు. దక్షిణాఫ్రికాకు వ΄డు రాజధానులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌కు అదేవిధంగా ఏర్పాటు చేస్తాననడం జగన్‌ తుగ్లక్‌ పాలనకు నిదర్శనమన్నారు. తీసుకున్న నిర్ణయం సరైంది అయితే 48 గంటల్లో తెదేపా అధినేత చంద్రబాబు సవాల్‌ను స్వీకరించి ఎన్నికల ద్వారా ప్రజలు ఇచ్చే తీర్పును వైకాపా నాయకులు కట్టబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, పార్టీ నాయకులు శశికాంత్‌ భూషణ్, దాయనేని ధర్మ, ఆర్ల వెంకటరత్నం, ఉప్పలపాటి నాగేంద్రం, షేక్‌ అజిమున్నిసా తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తి: వ΄డు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ప్రజాభిప్రాయాన్ని కోరాలని తెదేపా నాయకులు కోరారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన 48 గంటల సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఒంగోలు గ్రామీణం: రాజధానుల ఏర్పాటు విషయమై అసెంబ్లీని రద్దుచేసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాతీర్పు కోరాలని జడ్పీ మాజీ ఛైర్మన్‌ నూకసాని బాలాజీ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాజధాని మారిస్తే  రూ.10 వేల కోట్ల భారం అదనంగా ప్రభుత్వంపై పడుతుందని అన్నారు.  

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.