close

బుధవారం, అక్టోబర్ 16, 2019

తాజా వార్తలు

అంధత్వ నివారణే లక్ష్యం


మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో నరసింహులు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: కంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని డీఎంహెచ్‌వో నరసింహులు తెలిపారు. నగరంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకంపై వైద్యులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల స్థాయిలో విద్యార్థులందరికీ ప్రాథమిక పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారిని గుర్తించాలన్నారు. దీనికి క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా, ఆరోగ్య కార్యకర్తలు తదితరులందరికీ శిక్షణ ఇస్తామన్నారు. పీహెచ్‌సీలలో పనిచేస్తున్న వైద్యులు వైద్య ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయుల సహకారం తీసుకొని అక్టోబరు 10 నుంచి 16వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ వెలుగు పథకం కింద ప్రాథమిక పరీక్షలు చేసి సమస్యలున్న వారిని గుర్తించాలన్నారు. మొదట సీహెచ్‌సీలకు, శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తే ప్రాంతీయ కంటి ఆసుపత్రికి పంపుతామన్నారు. సర్వజన వైద్యశాల పర్యవేక్షుడు డాక్టర్‌ రామప్రసాద్‌ మాట్లాడుతూ కంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా భవిష్యత్తులో యువత అంధత్వ బారినపడకుండా నివారించొచ్చన్నారు. వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరారు. డీఈవో తహెరాసుల్తాన మాట్లాడుతూ విద్యాశాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కంటి ఆసుపత్రి పర్యవేక్షకుడు నరేంద్రనాథ్‌రెడ్డి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో వెంకటరమణ, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సమన్వయకర్త డాక్టర్‌ ఆంజనేయులు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్‌ మోక్షేశ్వరుడు, ఆర్‌బీఎస్‌కే జిలా సమన్వయకర్త హేమలత, పీహెచ్‌సీ, ప్రాంతీయ కంటి ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.