close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

తాజా వార్తలు

కిరాయి బైక్‌ సరే.. శిరస్త్రాణం?

ఈనాడు, హైదరాబాద్‌: పెళ్లిళ్లు.. శుభకార్యాలు.. పర్యాటక ప్రాంతాలకు ఎక్కడికైనా సరే..  కొన్ని కంపెనీల వారు నగరంలో ద్విచక్ర వాహనాలనూ కిరాయికి ఇస్తున్నారు.   ఓగో, మెట్రో, రాపిడో పేర్లతో ఈ కంపెనీలు బైక్‌లను అద్దెకు ఇస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే.. ట్రాఫిక్‌ పోలీసులు, కెమెరా కళ్లకు చిక్కుతున్నారు. శిరస్త్రాణం లేకపోవడంతో వారికి ఈ-చలాన్‌లు విధిస్తున్నారు. ఇవి సదరు కంపెనీకి వెళుతున్నాయి. శిరస్త్రాణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు శిరస్త్రాణం లేకుండా వెళుతున్న వారిని ఆపి కొనిపిస్తున్నారు. ఈ క్రమంలో చిక్కడపల్లి ట్రాఫిక్‌ పోలీసులు శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై వాహన చోదకులను ఆపారు. ఓ   బైక్‌పై పెండింగ్‌ చలానాలను పరిశీలించారు. రూ.3490 ఉండడంతో ఎందుకు చెల్లించలేదంటూ వాహన చోదకుడిని ప్రశ్నించారు. తాను కిరాయికి బైక్‌ తీసుకున్నానని చెప్పడంతో వాహన చోదకుడితో శిరస్త్రాణం కొనిపించి పంపించి వేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.