మంగళవారం, డిసెంబర్ 10, 2019
బాల్కొండ: బాల్కొండ మండలం జలాల్పూర్ శివార్లలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిలో ప్రభుత్వం వందశాతం రాయితీపై అందజేసిన చేపపిల్లలను మత్స్యసహకార సంఘం జిల్లా డైరెక్టర్లు నరేందర్, గంగాధర్ వదిలారు. సమగ్ర మత్స్యాభివృద్ధి పథకం కింద 8.73లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. కార్యక్రమంలో మత్స్యాభివృద్ధి అధికారి రాజనర్సయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు