close

సోమవారం, డిసెంబర్ 09, 2019

తాజా వార్తలు

సామాజిక సేవతో చిరస్మరణీయం

విజయమ్మ వర్ధంతి సభలో రాష్ట్ర మంత్రి ఈశ్వర్‌

గోదావరిఖని, న్యూస్‌టుడే: సామాజిక సేవా కార్యక్రమాలతో కోరుకంటి విజయమ్మ ప్రజల్లో నిలిచిపోతారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సతీమణి విజయమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఆదివారం గోదావరిఖనిలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, నడిపెల్లి దివాకర్‌రావు, సుంకె రవిశంకర్‌, జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధుకర్‌ హాజరై విజయమ్మకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డుల జారీ, కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే చందర్‌ ప్రకటించారు. గోదావరిఖని పట్టణ ప్రజలకు స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించేందుకు ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం ప్రతి డివిజన్‌లో కుట్టు శిక్షణ కేంద్రంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో ఆమె జ్ఞాపకాలు చిరకాలం నిలిచిపోతాయన్నారు. ఎమ్మెల్యే చందర్‌ మాట్లాడుతూ విజయమ్మ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయించినట్లు తెలిపారు. జీవిత భాగస్వామిగా అండగా ఉంటూ తన రాజకీయ ఉన్నతికి ఎంతో సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. తాను లేని లోటును సామాజిక కార్యక్రమాల ద్వారా భర్తీ చేసుకుంటానని వెల్లడించారు. ముందుగా విజయమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే చందర్‌ భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త పాలనాధికారిణి వనజాదేవి, జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి, ఎంపీపీలు విజయ, అనసూర్య, స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్‌ విజయారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మాతంగి నర్సయ్య, బిరుదు రాజమల్లు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సహఫంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

బోడగూడెం ముస్తాబు

అది ఓ మారుమూల పల్లె..చుట్టూ దట్టమైన అడవులు..నిన్నటి వరకు అటువైపు ఏ అధికారి వెళ్లలేదు..వారి ఆలనా పాలనా చూడలే..కాని ఆ గూడాన్ని ఇప్పుడు ఏకంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ సందర్శించనున్నారు. దీంతో ఉన్నంతలోనే బతుకులు సాగిస్తున్న ఆ గిరిజన పల్లె సందడిగా మారింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా గిరిజనుల సమస్యలు, వారి జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు గ్రామం ఎంపిక కావడంతో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి అధికారులు ఒకరి వెనుక ఒకరు వచ్చి గిరిజనుల జీవన విధానాలు తెలుసుకుంటున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి పంచాయతీలోని బోడగూడెం గవర్నర్‌ రాక కోసం ముస్తాబవుతోంది.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.