Azadi Ka Amriut Mahotsav: ఆంగ్లేయ కామాంధులకు అడ్డుపడి...
Azadi Ka Amriut Mahotsav: ఆంగ్లేయ కామాంధులకు అడ్డుపడి...

అమరుడైన హంపన్న

ఈ వీరగల్లు గుడిలో.. కావలి హంపన్న ఆత్మ కాపురముండున్‌ తావెక్కడ చాలును భర తావనియే వాని ఆలయమ్మగును గదా!

- హంపన్న గురించి విద్వాన్‌ విశ్వం రాసిన ‘ఒకనాడు’ కావ్యంలోని భాగమిది

తెల్లవారి జాతి దురహంకారాన్ని భారతదేశంలో సామాన్యులు సైతం ధైర్యంగా ఎదిరించారు. భారతీయ మహిళల మాన మర్యాదలను కాపాడేందుకు ప్రాణాలనూ పణంగా పెట్టారు. రైల్వే గేటుకీపరుగా పనిచేసిన గూళపాళెం హంపన్న అనే ధీరుడు ఇలాంటి ప్రయత్నంలోనే 128 ఏళ్ల క్రితం ఇదే రోజు అమరుడయ్యారు. ప్రస్తుత అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళపాళేనికి చెందిన హంపన్న.. గుంతకల్లు వద్ద రైల్వేగేటు కాపలాదారుగా పనిచేసేవారు. ఆయన బ్రిటిష్‌ సిపాయిల తుపాకిగుళ్లనూ లెక్కచేయకుండా ఎదిరించిన తీరును నేటికీ స్మరించుకుంటారు.

1893 అక్టోబరు 4న తమిళనాడులోని వెల్లింగ్టన్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న సైనిక పటాలం గుంతకల్లు వద్ద రైలు మారాల్సి వచ్చింది. సిపాయిలు ఓ బంగళాలో దిగారు. మద్యం తాగి నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఓ యువతి, వృద్ధురాలు వారి కంటపడ్డారు. సైనికులు అత్యాచారం చేయబోగా వారిద్దరూ తప్పించుకుని రైల్వేగేటు వద్దకు చేరుకున్నారు. గేటుకీపరు హంపన్న వారి దీనస్థితిని చూసి, తన గదిలో ఆశ్రయం ఇచ్చారు. సైనికులు గది తలుపులు విరగ్గొట్టబోయారు. తాను నిరాయుధుడినని, అవతలి వారి చేతిలో తుపాకులున్నాయని కూడా హంపన్న వెరవలేదు. వారితో వీరోచితంగా తలపడ్డారు. ఒక్క ఉదుటన సైనికులను అవతలకు నెట్టేశారు. దాంతో సైనికులు తుపాకితో హంపన్నను కాల్చగా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తుపాకిగుళ్ల శబ్దం విని రైల్వేపోలీసులు, స్థానికులు చేరుకోవడంతో సైనికులు పారిపోయారు. హంపన్నను గుత్తి ఆసుపత్రికి తరలించినా, దారిలోనే మరణించారు. ఈ ఘటనపై బ్రిటిష్‌ కోర్టులో విచారణ తప్పు దోవ పట్టింది. హంపన్నే ఆ మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారని, తమపై దాడి చేయబోగా ఆత్మరక్షణ కోసం కాల్చామని సైనికులు చెప్పగా, కోర్టూ నిర్ధారించింది.

హంపన్న వీరత్వాన్ని ప్రపంచానికి చాటాలనుకున్న స్థానికులే విరాళాలు సేకరించి, గుత్తిలో 9 చదరపు అడుగుల స్థలం కొని, హంపన్న సమాధి, స్మారకం నిర్మించారు. గుంతకల్లులో బ్రిటిష్‌ సైనికుల బారి నుంచి ఇద్దరు స్త్రీలను రక్షించబోయి అమరుడైన హంపన్న అస్థికలు ఇక్కడ భూస్థాపితం చేసినట్లు ఫలకంపై రాయించారు.

- ఈనాడు డిజిటల్‌, అనంతపురం


‘‘రైతుల త్యాగాన్ని వృథా కానివ్వం’’

‘‘ఈ అమానవీయ మారణకాండను చూసిన తర్వాత కూడా మౌనంగా ఉన్నవారు ఇప్పటికే చనిపోయినట్లు లెక్క. రైతుల ప్రాణ త్యాగాన్ని మేం వృథా కానివ్వం. అన్నదాతల సత్యాగ్రహం వర్ధిల్లాలి’’

- రాహుల్‌ గాంధీ

‘‘ఈ దేశ రైతులను భాజపా ఇంకెంతగా ద్వేషిస్తుంది. వారికి బతికే హక్కు లేదా?. వారు తమ గళం విప్పితే కాల్చి చంపుతారు లేదా కారుతో తొక్కి చంపుతారు. ఇక చాలు. ఇది రైతుల దేశం. భాజపా కాఠిన్య భావజాల కేంద్రం కాదు. రైతుల గొంతు ఇంకా గట్టిగా వినిపిస్తుంది అజయ్‌ మిశ్ర వెంటనే రాజీనామా చేయాలి. న్యాయ విచారణ జరిపించాలి’’

- ప్రియాంకా గాంధీ

‘‘యూపీ ఘటన దిగ్భ్రాంతికరం. అన్నదాతలతో భాజపా వ్యవహరించే విధానం ఇది. రైతులు తమ కోసం కాదు, దేశం కోసం, ఆహార భద్రత కోసం పోరాడుతున్నారు. ఇలాంటి అనాగరిక చర్యలతో రైతుల పోరాటాన్ని ఆపలేరు’’

- సీపీఎం

‘‘రైతులకు తూటాలు, హంతకులకు పూల దండలు. మోదీ-యోగీ రాజ్యం రక్తదాహంతో కూడినది. వారిపై ప్రజలు బ్యాలెట్‌తో ప్రతీకారం తీర్చుకుంటారు. రైతులు పోరాటంలో గెలిచి తీరతారు’’

- సీపీఐ


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని