close

తాజా వార్తలు

24 గంటల్లో మమత అనుకున్నది చేశారు: మోదీ 


కోల్‌కతా: మంగళవారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటుచేసుకున్న అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పిన ప్రకారమే ప్రతీకారం తీర్చుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాల గురించి ఆమె భయపడుతున్నారని, తన నీడను చూసి తానే ఆందోళనకు గురవుతున్నారని బుధవారం బెంగాల్‌లో నిర్వహించిన ర్యాలీలో ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన ఘర్షణల్లో సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం కావడంపై భాజపా, టీఎంసీ పార్టీలు ఒకదాని మీద ఒకటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. 
‘ప్రతీకారం తీర్చుకుంటానని రెండు రోజుల క్రితం మమతా దీదీ బహిరంగంగా ప్రకటన చేశారు. 24 గంటల్లో ఆమె అనుకున్నది చేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రోడ్‌ షో మీద దాడి చేశారు. రాష్ట్రంలో భాజపా ప్రభంజనాన్ని చూసి ఆమె ఆందోళనకు గురవుతున్నారు’ అని మోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. 
ఈ ఆదివారం చివరి దశ ఎన్నికల్లో భాగంగా బెంగాల్‌లోని కోల్‌కతాతో కలిపి 9 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net