టాప్‌ 10 న్యూస్‌ @ 9AM
close

తాజా వార్తలు

Updated : 24/12/2020 09:12 IST

టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

1. మరో వేషంలో మహమ్మారి!

జన్యుమార్పిడి జరిగిన కరోనాతో కొద్ది రోజులుగా సతమతమవుతోందన్న బ్రిటన్‌కు మరో కొత్త బెడద ముంచుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో మార్పు చెంది, అక్కడ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న ఇంకో కొత్త రకం కొవిడ్‌ వైరస్‌ తాజాగా లండన్‌కు చేరుకుంది. ఇద్దరు పౌరులు ఇప్పటికే దీని బారినపడినట్లు బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి మట్‌ హన్‌కాక్‌ బుధవారం వెల్లడించారు. కొత్త రకం కరోనా(వియుఐ202012/01)ను మించిన వేగంతో వ్యాపించే లక్షణాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వైరస్‌కు ఉన్నాయని, ఉత్పరివర్తనం కూడా త్వరత్వరగా జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొవాగ్జిన్‌ టీకా తీసుకుంటే ఏడాదిపాటు యాంటీబాడీలు

2. ఉద్యోగాలు అడగం అన్నయ్యా... ఇస్తాం!

వారి వయసు 25 నుంచి 30 ఏళ్లు... పేద, మధ్యతరగతి కుటుంబాల వారు. ఉన్నత చదువులు చదివారు. వినూత్న ఆలోచనలే వారి పెట్టుబడి. ఆత్మవిశ్వాసం, మనో ధైర్యంతో.. ఎంతో ఇష్టంగా పారిశ్రామిక రంగంలో ప్రవేశిస్తున్నారు. ముందున్నది ముళ్లబాటే అయినా ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ తమను తాము నిరూపించుకుంటున్నారు. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు.  తెలంగాణలో పరిశ్రమల్ని స్థాపిస్తున్న వారిలో యువత 60 శాతం ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దోచారు.. దీవుల్లో దాచారు..!

భారీగా విదేశాల్లో దాచిన అగ్రిగోల్డ్‌ సొమ్ము జాడ ఎట్టకేలకు బహిర్గతమైంది. సంస్థ యాజమాన్యం ఆ మొత్తాన్ని కరీబియన్‌ సముద్రంలోని కేమన్‌ దీవుల్లో దాచినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తాజా దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం విదేశాల్లో ఆర్థికపరమైన సేవలందించే పనామా సంస్థ మొసాక్‌ ఫొన్సెంకా సహకారం తీసుకున్నట్లు తేలింది. కేమన్‌ దీవుల్లో డొల్ల కంపెనీలు సృష్టించి పెట్టుబడులను మళ్లించడం ద్వారా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 62 నిమిషాల్లో 10 కి.మీ.లు

టీసీఎస్‌ సంస్థ బెంగళూరులో నిర్వహించిన 10 కి.మీ. పరుగు పోటీలో ఐదు నెలల గర్భిణి పాల్గొని విజయవంతంగా గమ్యాన్ని చేరుకోగలిగారు. రోజూ పరుగును అభ్యసించడం అలవాటుగా ఉన్న అంకిత గౌర్‌.. మిగిలినవారితో పాటు ఆదివారం 10కె పరుగులో పాల్గొని 62 నిమిషాల్లో లక్ష్యాన్ని సాధించారు. ముందుగానే వైద్యులను సంప్రదించాననీ, మధ్యమధ్యలో కాస్త విరామం తీసుకుంటూ పాల్గొనవచ్చని వారు చెప్పడంతో ఆ ప్రకారమే చేశానని ఆమె చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రేమోన్మాదానికి యువతి బలి

 ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. పది రోజుల కిందటే ఉద్యోగంలో చేరిన ఆనందం తీరకముందే దారుణ హత్యకు గురైంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత (19) అనే ఎస్సీ వర్గానికి చెందిన యువతిని అత్యంత పాశవికంగా హతమార్చారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. గొంతు నులిమి చంపేశారు. అనంతరం పొట్ట కింద భాగంలో నిప్పు అంటించారు. దీంతో ఆమె శరీర భాగం కొంత కాలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ రుచులను నిజాం మెచ్చారు!

ఖుజీ..  దమ్‌కీరాన్‌... కైరీకా దోప్యాజా.. మటన్‌ షికమ్‌పూర్‌... ఇవన్నీ వంద సంవత్సరాల క్రితం నిజాం ప్రభువుల భోజనాల బల్లపై సందడి చేసిన వంటకాలు.. ఇప్పటితరానికి పరిచయం లేని ఆ అద్భుతమైన ఆ వంటకాల తయారీ రహస్యాల్ని అందిపుచ్చుకున్నారామె. ఆ రుచులను నేటికీ యథాతథంగా అందిస్తూ విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు నిజాం కుటుంబానికి చెందిన షహనూర్‌..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ముక్కోటి ఆశీస్సులు!

ధనుర్మాసం మొదలైన తర్వాత వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. సౌరమానం ప్రకారం మార్గశిర, పుష్య మాసాలలో ఏదో ఒక నెలలో ఈ పర్వదినం వస్తుంది. ఈ రోజును స్వర్గద్వార ఏకాదశి, ముక్కోటిఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈ పేర్ల వెనక వేర్వేరు కథనాలున్నాయి. దేవతలకు ఉత్తరాయణం పగలు. దక్షిణాయనం రాత్రి. ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో వచ్చే ఏకాదశినాడు ముక్కోటి దేవతలు విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. ఆ రోజున శ్రీమహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే వారికి ఐహిక, పారమార్థిక ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బడిలో తింటే 5...ఇంటికైతే 3

పాఠశాలకు రాని, వచ్చినా మధ్యాహ్న భోజనం చేయని పిల్లలకు ఇంటికి ఇచ్చే కోడిగుడ్లను తగ్గించారు. మధ్యాహ్న భోజనం తినేవారికి వారానికి ఐదు, ఇంటికైతే మూడు గుడ్లు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. భోజనం చేయని పిల్లలకు బియ్యంతో పాటు, వంటఖర్చు(కూరగాయలు, నూనె, పప్పులు తదితరాలు) కింద కందిపప్పు సరఫరా చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐదో తరగతి వరకు బడులుండవ్‌!

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2020-21) 1 నుంచి 5 తరగతులకు బడులు తెరవరాదని విద్యాశాఖ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అంటే, ఈసారికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెరిచే అవకాశం లేనట్లే. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఆ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని తెలుస్తోంది. కరోనా టీకా ఇంకా అందుబాటులోకి రాకపోవడం.. కొత్త స్ట్రెయిన్‌ భయం తదితర కారణాలతో తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లల్ని బడులకు పంపించే పరిస్థితి ఉండకపోవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రాహుల్‌కు చోటు లేదా?

 ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన భారత్‌.. రెండో టెస్టుకు తుది జట్టులో మూడు నుంచి అయిదు మార్పులు చేస్తుందన్న అంచనాలున్నాయి. కోహ్లి, షమి సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయారు కాబట్టి ఆ ఇద్దరి స్థానాల్ని వేరే ఆటగాళ్లతో భర్తీ చేయాలి. అలాగే తొలి టెస్టులో ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శల పాలైన పృథ్వీ షాపై వేటు పడటమూ ఖాయమే. పృథ్వీ స్థానంలోకి గిల్‌, షమి బదులు సిరాజ్‌ లేదా సైని వస్తారని అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పుజారా కోసం ప్రత్యేక వ్యూహం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని