అనవసరంగా బయట తిరిగితే కేసులే..
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 20:28 IST

అనవసరంగా బయట తిరిగితే కేసులే..

కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని పోలీసుల విజ్ఞప్తి

అమరావతి: ఏపీలో బుధవారం మధ్యాహ్నం 12గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలులోకి రానున్న నేపథ్యంలో పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. అకారణంగా బయట తిరిగేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థలు, కార్యాలయాలు విధిగా కర్ఫ్యూ ఆంక్షలు పాటించాలని కోరారు. మరోవైపు, బుధవారం మధ్యాహ్నం 12గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాల పాటు కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రోజూ ఉదయం 6గంటల నుంచి 12గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతించనున్నారు. అలాగే, ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం 12గంటల వరకే సేవలందించనున్నాయి. ఆ తర్వాత ప్రజా రవాణా, ప్రైవేటు వాహనాల సేవలు బంద్‌ కానున్నాయి. రేపట్నుంచి 12గంటల తర్వాత రాష్ట్ర సరిహద్దులు సైతం పోలీసులు మూసివేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని