close

తాజా వార్తలు

Updated : 04/05/2021 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్టీఐ కమిషనర్లుగా హరిప్రసాద్‌, చెన్నారెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా కాకర్ల చెన్నారెడ్డి, ఉల్చాల హరిప్రసాద్‌ పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఇద్దరి పేర్లు ఖరారు చేసిన కమిటీ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది. సచివాలయంలో ఇవాళ సీఎం జగన్‌ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆర్టీఐ కమిషనర్లుగా హరిప్రసాద్‌, చెన్నారెడ్డిని కమిటీ ఎంపిక చేసింది. సమాచార హక్కు చట్టం అమలును సమాచార హక్కు కమిషనర్లు పర్యవేక్షిస్తారు.

హరిప్రసాద్‌ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. రెండు దశాబ్దాలుగా ఈనాడు సంపాదకీయం పేజీలో సీనియర్‌ చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. పోస్ట్‌, లా గ్రాడ్యుయేట్‌ అయిన కాకర్ల చెన్నారెడ్డి పలు జిల్లా కోర్టుల్లో, రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో 15 ఏళ్లుగా న్యాయవాదిగా ఉన్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని