సముద్రగర్భ శోధనకు కేంద్రం రెడీ
close

తాజా వార్తలు

Published : 17/06/2021 01:38 IST

సముద్రగర్భ శోధనకు కేంద్రం రెడీ

దిల్లీ: సాగర గర్భంలో నిక్షిప్తమై ఉన్న వనరుల అన్వేషణకు కేంద్రం సిద్ధమైంది. మహాసముద్రంలోని సహజ వనరుల స్థిరమైన వినియోగం, సముద్ర సాంకేతికతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ ప్రతిపాదించిన ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’కు బుధవారం అంగీకారం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్విహించిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు. బ్లూ ఎకానమీ వృద్ధికి ఈ మిషన్‌ ఊతమివ్వడంతోపాటు.. దేశాన్ని కొత్త శకంలోకి తీసుకెళ్తుందని ఆశాభావాం వ్యక్తం చేశారు. మిషన్‌లో భాగంగా మహాసముద్రంలో 6 వేల మీటర్ల లోతులోని ఖనిజాల గురించి అధ్యయనం చేయనున్నట్లు వివరించారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాగర గర్భంలో చోటుచేసుకుంటున్నమార్పులు, సముద్రపు లోతుల్లో జీవవైవిధ్యంపైనా అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు.  సముద్రపు జీవరాశి గురించి పరిశోధించేందుకు  అత్యాధునిక మెరైన్‌ స్టేషన్‌, సముద్రతీరంలో థర్మల్ శక్తి కేంద్రాన్నికూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మిషన్‌ కోసం ఐదేళ్లలో రూ.4,077 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని దశలవారీగా ఖర్చు చేస్తామన్నారు.  దీంతో పరిశోధనలకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనా తర్వాత ఈ విధమైన సాంకేతికతను కలిగి ఉన్నఆరో దేశంగా భారత్‌ నిలవనుందని చెప్పారు. ఆత్మనిర్భర భారత్‌ సాధనకు ఇది తోడ్పడుతుందని తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని