close

తాజా వార్తలు

Published : 11/04/2021 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విశాఖ కేజీహెచ్‌లో సీఐడీ సోదాలు

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఐడీ అధికారులు వైద్య పరికరాల ఆడిట్ చేపట్టింది. ఇందులో భాగంగా విశాఖలోని కేజీహెచ్‌ ఆస్పత్రిలో సీఐడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో వైద్య పరికరాల నిర్వహణ, వార్షిక కాంట్రాక్టు, గుత్తేదారు సంస్థతో జరిగిన ఒప్పందాలు, చెల్లింపులు వంటి వాటిపై వివరాలను సేకరించింది. ఆదనపు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, ఎనిమిది మంది సబ్ ఇన్‌స్పెక్టర్లతో కూడిన ఆరు బృందాలు వివిధ విభాగాల సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరించారు. కేజీహెచ్‌లో దాదాపు 3వేల పైగా పరికరాలు ఉన్నాయి. వీటి కొనుగోళ్లలో కొంతవరకు వాటి ధర కంటె ఎక్కువ ఇచ్చి కొన్నట్టు అరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని