కృష్ణానది కరకట్ట విస్తరణకు జగన్‌ శంకుస్థాపన

తాజా వార్తలు

Updated : 30/06/2021 13:39 IST

కృష్ణానది కరకట్ట విస్తరణకు జగన్‌ శంకుస్థాపన

అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండేళ్లకు అమరావతి ప్రాంతంలో సీఎం జగన్‌ మొదటి శంకుస్థాపన చేశారు. కృష్ణా నది కుడి కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద నుంచి రాయపూడి వరకు 15 కి.మీ పొడవునా రెండు వరుసల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి కావాల్సిన రూ.150 కోట్ల నిధులను అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టైనబిలిటీ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సమకూరుస్తోంది. మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ పనులను చేపట్టనుంది. విస్తరణలో భాగంగా పాదచారులు నడిచేందుకు వీలుగా రెండు వైపులా ఒకటిన్నర మీటర్ల మేర మార్గం ఏర్పాటు చేయనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని