గవర్నర్‌ను కలిసిన ఎస్‌ఈసీ

తాజా వార్తలు

Updated : 16/03/2020 14:02 IST

గవర్నర్‌ను కలిసిన ఎస్‌ఈసీ

అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు గల కారణాలను వివరించారు. ఏ పరిస్థితుల్లో  నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. ఎస్‌ఈసీ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీని రాజ్‌భవన్‌కు పిలిపించి గవర్నర్‌ మాట్లాడారు. ఎస్‌ఈసీతోపాటు ఐజీ సత్యనారాయణ గవర్నర్‌ను కలిశారు. దాదాపు 45 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది.

స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌పై సీఎం జగన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్‌ఈసీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని