ప్రధాని కేర్స్‌ నిధికి ఏపీ గవర్నర్‌ విరాళం

తాజా వార్తలు

Published : 30/03/2020 18:04 IST

ప్రధాని కేర్స్‌ నిధికి ఏపీ గవర్నర్‌ విరాళం

అమరావతి: దేశంలో కరోనాపై పోరాటానికి ఏర్పాటు చేసిన ప్రధాని కేర్స్‌ నిధికి ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విరాళాన్ని ప్రకటించారు. తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు సీఎం సహాయ నిధికి రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ప్రజలు ఉదారంగా విరాళాలు అందించి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రజలు మరింతగా సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలన్నారు.సామాజిక దూరం పాటిస్తూ, స్వీయ నిర్భందంలో క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ‘‘ ఈ మహమ్మారి అన్ని దేశాలకూ వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను అందరూ పాటించాలి. కరోనా లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ విషయంలో విదేశీ ప్రయాణికులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు పాటించాలి. కూలీలు, వలస కార్మికులకు సామగ్రిని రెడ్‌క్రాస్‌ ద్వారా ఉచితంగా పంపిణీ చేయాలి’’ అని గవర్నర్‌ అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో కారోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో తాజా పరిస్థితిని గవర్నర్‌కు తెలియజేసినట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని