విశాఖ గ్యాస్‌ ఘటన.. రేపు పోస్టుమార్టం

తాజా వార్తలు

Updated : 07/05/2020 20:54 IST

విశాఖ గ్యాస్‌ ఘటన.. రేపు పోస్టుమార్టం

విశాఖ: గ్యాస్‌లీక్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో 10 మంది మృతదేహాలు కేజీహెచ్‌ శవాగారంలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మృతదేహాలకు రేపు ఉదయం శవపరీక్ష నిర్వహిస్తామని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ తెలిపారు. అలాగే, విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో 316 మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. విశాఖ కేజీహెచ్‌లో 193 మంది గ్యాస్‌ లీక్‌ బాధితులకు చికిత్స జరుగుతుండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో 66 మంది బాధితులు, గోపాలపట్నం, పెందుర్తి ఆస్పత్రుల్లో 57 మందికి చికిత్స జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని