ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతు ఆత్మహత్యాయత్నం

తాజా వార్తలు

Published : 20/05/2020 07:02 IST

ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతు ఆత్మహత్యాయత్నం

దండేపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆ రైతు పేరు ఎద్దు బుచ్చయ్య. 63 ఏళ్లు పైబడిన వయసు.. ఆరుగాలం శ్రమించి రెండెకరాల్లో వరిపంట పండించాడు. తీరా ధాన్యం విక్రయిద్దామని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే తూకమేసే విషయంలో అక్కడా అనుకోని ఇబ్బందులు... ఇలా ఏకంగా నెలపాటు విసిగి వేసారిన ఆయన కొనుగోలు కేంద్రంలోనే ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. పురుగుల మందు తాగి అక్కడే పడిపోయాడు. గమనించిన ఇతర రైతులు వెంటనే అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స అందిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతికి అద్దం పట్టే ఈ ఘటన మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్‌లో జరిగింది. బుచ్చయ్య ధాన్యం తూకం వేసే విషయంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారని తోటి రైతులు చెప్పారు. డబ్బులిచ్చిన వారికే తూకం వేయిస్తున్నారని ఆవేదన చెందారు. నిరసనగా నెల్కివెంకటాపూర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని