Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 5 PM

1. ఏపీలో కొత్త వైరస్‌ లేదు: పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి కొత్త వైరస్‌ లేదని రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు బుదరచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో ఎన్‌440కె వైరస్‌ ఉన్నట్లు నిర్ధరణ జరగలేదన్నారు. రాష్ట్రంలో కొత్త రకం వైరస్‌ లేదనే విషయాన్ని నిపుణులే చెబుతున్నారన్నారు. కరోనా పరీక్షలు చేయడంలో దేశంలోనే ఏపీ ముందుందని చెప్పారు. 

2. Sangam dairy: కస్టడీ పొడిగించేది లేదు

సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రిమాండ్‌లో ఉన్న తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర కస్టడీని పొడిగించేది లేదని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో ధూళిపాళ్ల వేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విజయవాడలోని ఏసీబీ కోర్డులో విచారణ జరిగింది. నరేంద్ర తరఫున ఆయన న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ వాదనలు వినిపించారు. రేపటితో కస్టడీ ముగియనుందని.. కరోనా సోకి ధూళిపాళ్ల ఆస్పత్రిలో ఉన్నందున విచారణ పూర్తి కాలేదని ఏసీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 

3. ​​​​​​Bengal violence: గవర్నర్‌ను నివేదిక కోరిన హోంశాఖ

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ను నివేదిక కోరింది. హింసపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరినప్పటికీ ఎలాంటి స్పందనా లేకపోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్‌కు సూచించింది. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలంది. ఇప్పటికే కేంద్రహోంశాఖ హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. 

Bengal: కేంద్ర మంత్రి కారుపై దాడి

4. coronavaccine: మరింత వేగవంతం చేయండి: మోదీ

ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగం తగ్గకుండా రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులపై గురువారం కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు, జిల్లాల వారీగా నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాలు పెంచడానికి రాష్ట్రాలకు సహాకారం, ఔషధాల లభ్యతలపై ప్రధానంగా చర్చించారు. దేశంలో వ్యాక్సినేషన్‌ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. 

5. చైనాకు చెక్‌: భారత్‌ను ప్రశంసించిన అమెరికా

దేశంలో 5జీ ట్రయల్స్‌లో చైనా సాంకేతికతను వాడకూడదని భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసించింది. 5జీ ట్రయల్స్‌లో చైనాకు చెందిన హువాయ్‌, జీటీఈ సాంకేతికతను వాడవద్దని నిర్ణయించడం భారత ప్రజలతో పాటు ప్రపంచానికి శుభవార్త అని పేర్కొంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న అక్కడి టెక్‌ కంపెనీలకు దూరంగా ఉండాలని అమెరికా తన మిత్ర దేశాలకు మరోసారి పిలుపునిచ్చింది. 

6. Corona: ఈ భయాలు వద్దే వద్దు!

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గడం లేదు. ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరోనా సోకి కొంత మంది చనిపోతుంటే, మహమ్మారికి భయపడి మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. అర్ధాంతరంగా తనువు చాలించి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు. కొవిడ్‌ రోగుల్లో 30 శాతం మంది మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనో ధైర్యంతో కరోనాను జయించవచ్చని వైద్యులు చెబుతున్నారు. కరోనా పాజిటివ్‌ వస్తే జీవితం వృథా అన్న ఆలోచన నుంచి బయటపడాలని సూచిస్తున్నారు. 

7. ఒకే కుటుంబంలో 8 మంది మృత్యువాత

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. హోమియో వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు స్థానిక ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వీళ్లంతా డ్రోసెరా 30 అనే ఔషధం తీసుకోగా.. అందులో 91 శాతం నాటుసారా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులకు ఔషధం ఇచ్చిన వైద్యుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం విచారాణకు ఆదేశించింది. 

8. COVID19: దిల్లీలో మరణ మృదంగం

కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక దేశ రాజధాని దిల్లీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 335మంది కరోనాతో చికిత్స పొందుతూ మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 78,780 కరోనా టెస్టులు చేయగా, 19,133మంది కరోనా బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 24.29శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 20,028మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

9.  లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 272 పాయింట్లు పెరిగి 48,949 వద్ద, నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 14,724 వద్ద స్థిరపడ్డాయి. ఆర్‌ సిస్టమ్స్‌ ఇంటర్నెట్‌, ఇగార్షి మోటార్స్‌, కోఫోర్జ్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌, మాస్టెక్‌  లిమిటెడ్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఆగ్రోటెక్‌ ఫుడ్‌, బంధన్‌ బ్యాంక్‌, మార్పిన్‌ ల్యాబ్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌, యారీడజైన్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

10.  IPL: బుడగ పేలుడుపై దాదా స్పందనేంటి?

ఐపీఎల్‌ బుడగ బలహీనంగా మారేందుకు బహుశా ప్రయాణాలే కారణం కావొచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అంచనా వేస్తున్నారు. వాస్తవ  కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. అసలేం జరిగిందో తెలుసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. కరోనా సంక్షోభంలోనూ ఐపీఎల్‌ను ఎందుకు నిర్వహించాలనుకున్నారో వివరించారు. ‘బయో బుడగ లోపల ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో నాకైతే నిజంగా తెలియదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బహుశా ప్రయాణాలు ఒక కారణం కావొచ్చు’ అని దాదా అన్నారు. 

IPL Postpone: మాల్దీవులకు ఆస్ట్రేలియా క్రికెటర్లు 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని