Immunity: మంచి ఆహారంతో కరోనాను తరిమేద్దాం!

తాజా వార్తలు

Published : 27/05/2021 00:18 IST

Immunity: మంచి ఆహారంతో కరోనాను తరిమేద్దాం!

 

కరోనా వైరస్‌ చెలరేగిపోతోంది. ఇబ్బడిముబ్బడిగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరిని ఆసుపత్రుల్లో చేర్చుకుని చికిత్సనందించడం కష్టం. ఈ నేపథ్యంలో కొవిడ్‌ లక్షణాలు అంతగా లేనివారు ఇంట్లోనే ఉంటూ వైద్యసహాయం పొందడం మేలు. స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న పాజిటివ్‌ వ్యక్తులు ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం!

రోగనిరోధక శక్తి బాగున్నప్పుడే మనకు ఆరోగ్యం. వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లితే మన ఒంట్లో జబ్బుల తాకిడి పెరుగుతుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మనలో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకు రోజూ వారీ ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* ముఖ్యంగా రోజుమొత్తంలో ఎక్కువగా నీరు తాగుతుండాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తగినంత నీరు శరీరంలో ఉంటే విష తుల్యాలను వెలుపలికి పంపిచడం సులభమవుతుంది. ముక్కు, శ్వాస నాలాలు, జిగురు పదార్థం నిలకడగా ఉండి వైరస్‌ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డకుంటుంది.

* మంచి నీరుతో పాటు కొబ్బరినీరు, నిమ్మరసం, గ్రీన్‌టీ, హెర్బల్‌టీ, సూప్‌లు, పాలు, మజ్జిగ వంటి వాటిని తరచూ తీసుకోవాలి.

* ఆహారంలో సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. సోయా ఉత్పత్తులు, బీన్స్‌, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్‌, మటన్‌, చేప, పాల ఉత్పత్తులు.

* వ్యాధి నిరోధక పెంచేందుకు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ బాగా పనిచేస్తాయి. వాల్‌నట్స్‌, గుమ్మడి, పుచ్చ, చేపల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవాలి.

* రోగనిరోధకశక్తి పెంపొందించడంలో విటమిన్ల పాత్ర కీలకం. ముఖ్యంగా విటమిన్ సి, ఎ, డి, ఈ బీ6, బీ12.. ఇవన్నీ మన ఒంట్లోని వ్యాధి నిరోధకతకు ఊతమిచ్చేవే ఇవే

* విటమిన్లు ఎక్కువగా ఆకుపచ్చని కూరగాయలు, జామ, దానిమ్మ, ఊసిరి, ద్రాక్ష వంటి పుల్లటి పండ్లు జింక్‌, క్యాలిషయం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు వైరస్‌ ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతాయి. ఇవి ఎక్కువగా గింజ ధాన్యాలు, పప్పుదినుసులు, సోయా బీన్స్‌, పుచ్చకాయ, గుమ్మడికాయ విత్తనాలు, చికెన్‌, గుడ్లు, వాల్‌నట్స్‌, చేపల్లో దొరుకుతాయి. వీటిని కూడా తరచూ తీసుకుంటూ ఉండాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని