ప్రభుత్వం ప్రాణాలతో చెలగాటమాడదు

తాజా వార్తలు

Published : 23/04/2021 01:06 IST

ప్రభుత్వం ప్రాణాలతో చెలగాటమాడదు

అమరావతి: రాష్ట్రంలో కరోనా మరణాలు విపరీతంగా పెరిగాయని జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో ఎదో జరిగిపోతున్నట్లుగా భయాందోళనలను కలిగించడం సరికాదన్నారు. ప్రతి రోజూ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు, నివేదికలను పారదర్శకంగా వెల్లడిస్తుందన్నారు. మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. రేపు కరోనాపై సీఎం జగన్ సమీక్షిస్తారని .. కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు.

‘‘కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మరణాలను దాస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేయడం సరికాదు. పది, ఇంటర్ తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలు నష్టపోతున్నారని ప్రభుత్వం భావించింది. పరిస్థితులకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కష్టమని భావిస్తే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఉపాధ్యాయులు, పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడదు. కొవిడ్‌ పరిస్థితులను ఆసరాగా తీసుకుని అధికంగా వసూలు చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు.

రాష్ట్రంలో మిర్చి, మామిడి, బత్తాయి ధరలు ఎక్కడా పడిపోలేదు. గతేడాదితో పోల్చితే ఈసారి ధరలు ఎక్కువగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చూపించే ప్రయత్నం చేయడం ఈ సమయంలో తగదు. ప్రతి గ్రామంలోని ఆర్బీకే లో కొనుగోళ్లు జరగాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఎక్కడా తన బాధ్యతను విస్మరించలేదు’’ అని కన్నబాబు అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని