Marriage gift: పెళ్లికి బహుమతిగా అయిదు లీటర్ల పెట్రోల్‌

తాజా వార్తలు

Published : 20/08/2021 01:42 IST

Marriage gift: పెళ్లికి బహుమతిగా అయిదు లీటర్ల పెట్రోల్‌

వినూత్న రీతిలో నిరసన తెలిపిన తమిళ హస్యనటుడు

చెన్నై: మండిపోతున్న పెట్రోల్‌,డీజెల్‌ ధరలు సామాన్యుని జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే కొన్ని నగరాల్లో పెట్రోల్‌ సెంచరీ దాటింది. దీంతో మధ్య తరగతి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తాజాగా తమిళ హస్య నటుడు మైల్ సామి పెరిగిన పెట్రోల్‌ రేట్లపై వినూత్నంగా నిరసన తెలిపాడు. అయిదు లీటర్ల పెట్రోల్‌ను ఓ పెళ్లికి బహుమతిగా తీసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కొత్తగా పెళ్లైన జంటను దీవించడానికి ఆయన వేదికపైకి వెళ్లాడు. తాను తీసుకొచ్చిన గిఫ్ట్‌ బ్యాగ్‌ నుంచి రెండు పెట్రోల్‌ క్యాన్‌లను తీసి వధూవరులకు అందించాడు. దీంతో నూతన దంపతులతో పాటు పెళ్లికి వచ్చిన అందరూ షాక్‌కు గురయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. పెరిగిన చమురు ధరలపై నిరసనగా ఇలా చేశానని వివరించారు. ఇటీవల పెట్రోల్ ధరలను లీటరుకు రూ.3 తగ్గిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. అయితే, ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని