భారీ కాన్వాయ్‌తో ఖమ్మం బయల్దేరిన షర్మిల
close

తాజా వార్తలు

Updated : 09/04/2021 13:53 IST

భారీ కాన్వాయ్‌తో ఖమ్మం బయల్దేరిన షర్మిల

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సంకల్ప సభకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఇవాళ సాయంత్రం 5గంటలకు సభ జరగనుంది. ఇందుకోసం ఆమె లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. పంజాగుట్టలో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల అభిమానులను కలుస్తూ ముందుకు సాగారు. ఎనిమిది ప్రాంతాల్లో షర్మిలకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సూర్యాపేటలో భోజనం చేసిన తర్వాత కూసుమంచి నుంచి ఖమ్మం జిల్లా నేతలు స్వాగతం పలుకుతారు. ఖమ్మంలో భారీ ర్యాలీ ద్వారా బహిరంగ సభకు చేరుకుంటారు.  

 సంకల్ప సభలో షర్మిలతోపాటు వైఎస్‌ సతీమణి, వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి పాల్గొననున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర ఏంటన్నదానిపై సంకల్ప సభ ద్వారా షర్మిల స్పష్టత ఇవ్వనున్నారు.  తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలన్నదే తన సంకల్పమన్న సంగతి ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీ సమీక్షా సమావేశాల్లో ఆమె వెల్లడించారు. ఖమ్మం సంకల్ప సభలో తన సంకల్పం ఏంటన్నది ప్రజలకు వివరించనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని