అబ్బురపరిచిన అంతరిక్ష దుస్తుల ప్రదర్శన
close

తాజా వార్తలు

Published : 11/04/2021 16:00 IST

అబ్బురపరిచిన అంతరిక్ష దుస్తుల ప్రదర్శన

మాస్కో: రష్యాలోని సరతోవ్‌ మ్యూజియంలో అంతరిక్ష దుస్తులను ప్రదర్శనకు పెట్టారు. ఇప్పటివరకు ఆ దేశానికి చెందిన వ్యోమగాములు ధరించిన స్పేస్‌ సూట్లను ప్రదర్శనలో ఉంచారు. తొలి వ్యోమగామి యూరీ గగారిన్‌ ధరించిన స్పేస్‌ సూట్‌ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూరీ గగారిన్‌ కాలం నుంచి ఇప్పటివరకు వ్యోమగాములు ధరించిన అంతరిక్ష దుస్తుల డిజైన్లలో లెక్కనేనన్ని మార్పులు జరిగాయని మ్యూజియం నిర్వాహకురాలు పేర్కొన్నారు. కాస్మోనాట్లను రాకెట్‌ లోపల సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంచేందుకు సాయపడే హూప్‌లూప్‌ ఫాస్టెనర్లు ఆధునిక హంగులు అద్దుకున్నాయని తెలిపారు. స్పేస్ సూట్లతోపాటు హెల్మెట్లు, చేతి తొడుగుల డిజైన్లలో మార్పులు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ ఒకేచోట ప్రదర్శనకు పెట్టడం సంతోషంగా ఉందన్నారు.

అంతరిక్ష యాత్రకు వెళ్లే వ్యోమగాములు భూమిపైకంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉండటంతో ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులు ధరిస్తారు. అంతరిక్షంలో ఆక్సిజన్‌ ఉండదు. ఉష్ణోగ్రతలు కూడా కనిష్ఠంగా ఉంటాయి. దాదాపు మైనస్‌ 100 డిగ్రీల నుంచి మైనస్‌ 120 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంటాయి. పీడనం చాలా తక్కువగా, రేడియేషన్‌ అధికంగా ఉంటుంది. ఇలాంటి సంక్లిష్ట వాతావరణంలో మానవులు జీవించడం సాధ్యం కాదు కాబట్టి అంతరిక్ష యాత్రకు వెళ్లే వ్యోమగాములు ప్రత్యేక దుస్తులు ధరిస్తారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని