AP High Court: తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోపై హైకోర్టు స్టే

తాజా వార్తలు

Updated : 22/09/2021 15:17 IST

AP High Court: తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోపై హైకోర్టు స్టే

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తితిదే బోర్డు సభ్యులతో పాటు భారీగా ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవో జారీ చేసింది. పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులను నియమించారని.. దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్లు అందులో పేర్కొన్నారు. తితిదే స్వతంత్రతను దెబ్బతీసేలా జీవోలు ఉన్నాయని పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు వాదించారు. నిబంధనలనకు అనుగుణంగానే నియమకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఆదేశాలు పరిశీలించి నిర్ణయం: మంత్రి వెల్లంపల్లి

తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకం జీవోను హైకోర్టు నిలిపివేయడంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పందించారు. సాంకేతిక అంశాలతోనే ఉన్నత న్యాయస్థానం జీవోను సస్పెండ్‌ చేసి ఉంటుందని..  హైకోర్టు ఆదేశాలను పరిశీలించి అప్పీల్‌కు వెళ్లాలా? వద్దా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని