KTR: సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వంతోనే పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం

తాజా వార్తలు

Published : 31/07/2021 19:01 IST

KTR: సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వంతోనే పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం

హైదరాబాద్‌: సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే పారిశ్రామికీకరణతో కూడిన అభివృద్ధి సాకారమవుతుందని.. తెలంగాణలో అదే జరుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడ గ్రామంలో పోకర్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేసిన ఇంజినీర్డ్ స్టోన్ ప్లాంటును మంత్రులు ఎర్రబల్లి దయాకర్, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. వ్యవసాయం, పరిశ్రమలు కలిసికట్టుగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం పురోగమిస్తుందన్నారు. ఇది గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు వేగంగా అనుమతులు మంజూరు చేసే టీఎస్ఐపాస్ వంటి అద్భుత విధానాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రూ.500 కోట్ల పెట్టుబడితో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్లాంటు ద్వారా ప్రీమియం ఇంజినీర్డ్ స్టోన్ తయారు చేసి ఇక్కడి నుంచి ఎగుమతి చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్లాంటు ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3 వేల మందికి కంపెనీ ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టెక్స్ టైల్ రంగంలోనూ విశేష అనుభవం ఉన్న పోకర్ణ గ్రూప్‌ రాష్ట్రంలో ఒక అప్పారల్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకురావాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని