close

తాజా వార్తలు

ఎందెందు వెతికినా.. దళారులే!

గదులు.. దర్శనం టికెట్లు బ్లాక్‌ మార్కెట్‌

● 23 మంది దళారుల అరెస్ట్‌

పట్టుబడిన దళారులు

తిరుమలలో శ్రీవారి దర్శనం టికెట్లు బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసిన దళారీని పట్టుకున్న పోలీసులు.. అతడిని విచారించడం ద్వారా తిరుమలలో దళారీ వ్యవస్థ డొంక కదిలించారు. తిరుమలలో గదులు, దర్శనం.. ప్రసాదం బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్న 23 మంది దళారులను తిరుమల టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం సాయంత్రం తిరుమల పోలీస్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుమల వన్‌టౌన్‌ సీఐ జగన్‌మోహన్‌రెడ్డి, టూటౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ నిందితుల వివరాలను వెల్లడించారు.

- న్యూస్‌టుడే, తిరుమల
ఈనెల 16వ తేదీన గుడూరు ఎమ్మెల్యే లెటర్‌ప్యాడ్‌పై ఆయనకు తెలియకుండానే శ్రీనివాసులు నాయుడు అనే వ్యక్తి బ్రేక్‌ దర్శనం టిక్కెట్లను ముగ్గురికి రూ.14,500లకు, ఇద్దరికి రూ.7వేలకు విక్రయించారు. ఆలయంలోని విజిలెన్స్‌ సిబ్బంది సాధారణ తనిఖీల్లో భాగంగా ఎమ్మెల్యే లెటర్‌ను దుర్వినియోగం చేసినట్లు గుర్తించి.. తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు నిందితుడు శ్రీనివాసులు నాయుడిని అదుపులోకి తీసుకుని.. దర్శనం టికెట్ల అక్రమ విక్రయంపై విచారించారు.

● శ్రీనివాసులు ఇచ్చిన సమాచారంతో గదులు, దర్శనం టికెట్లు, ప్రసాదం బ్లాక్‌ మార్కెట్‌ చేస్తున్న 23 మందిని అరెస్ట్‌ చేశారు. వారిలో తితిదే ప్రసాదం విభాగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ప్రసాద్‌, గ్రేడ్‌-2 ఉద్యోగి ఎన్‌.మహేష్‌, గ్రేడ్‌-1 ఉద్యోగి బి.నర్తింహమూర్తి, ఆంధ్రాబ్యాంక్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నాగార్జున తదితరులు ఉన్నారు.

బ్లాక్‌మార్కెటింగ్‌ ఇలా..

తిరుమలకు వచ్చే భక్తులకు మొదట వసతికి గది కావాలి, అనంతరం దర్శనం, చివరగా శ్రీవారి ప్రసాదం ఎంతో కీలకమైంది. వీటినే దళారులు అవకాశంగా మార్చుకున్నారు. భఫక్తులకు సీఆర్వోలో 24గంటలకు గదులను కేటాయిస్తారు. భక్తులు ముందే ఖాళీచేసి వెళుతుంటారు. ఆ సమయంలో అక్కడ పనిచేసే సులభ్‌ కార్మికులు, సూపర్‌వైజర్‌లు తామే తితిదే ఉద్యోగులుగా చెప్పి వారి వద్ద నుంచి గది తాళాలను తీసుకుని సమీపంలోని జీపుడ్రైవర్‌లు, దళారులకు సమాచారం ఇచ్చేవారు. అనంతరం రూ.50 గదిని రూ.1500కు తిరిగి భక్తులకు ఇచ్చేవారు. ఏఎన్‌సీ, జీఎన్‌సీ, ఎస్‌ఎన్‌సీతోపాటు పలు ప్రాం తాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దర్శనం కోసం ఎమ్మెల్యేలు, ప్రముఖుల సిఫారసు పత్రాలను వినియోగించి వీఐపీ బ్రేక్‌, ఇతర దర్శన టిక్కెట్లను అధిక ధరలకు విక్రయించేవారు. చివరగా లడ్డూప్రసాదాన్ని మూడు రకాలుగా సేకరించేవారు. మూడు రకాలు పరకామణి ఉద్యోగులకు ఇచ్చే లడ్డూలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, ఆలయంలోని కల్యాణం లడ్డూల విభాగంలో తక్కువ ధరలకు లడ్డూలను తీసుకుని బయట భక్తుల అవసరాలమేరకు అధిక ధరలకు విక్రయించేవారు. పరకామణిలో దాదాపు 200 మంది పనిచేస్తుండగా వారికి లడ్డూ ప్రసాదాన్ని రూ.5లకే అందిస్తారు. కొంత మంది ఆ టోకెన్‌లను వినియోగించని వాటిని సేకరించి అధిక ధరలకు విక్రయిస్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో దర్శన టిక్కెట్లను తీసుకుని మధ్యలో తిరిగి వచ్చేసి వాటిని లడ్డూల కోసం విక్రయించేవారు. లడ్డూలను రాంభగీచా వద్ద ఉన్న ఓ టీ దుకాణంలో ఉంచి అక్కడి నుంచి దళారులకు అందిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలినట్లు సీఐలు చెప్పారు. పెద్దలడ్డూ, ఒక వడ రూ.300కు వస్తే వాటిని బయట రూ.500 విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇందులో 23 మంది దళారులను అరెస్ట్‌ చేశామని అంతకుముందు అరెస్ట్‌ చేసిన వారితో కలిపి దాదాపు 80 మంది దళారులను అరెస్ట్‌ చేసినట్లు సీఐలు తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. సమావేశంలో వన్‌టౌన్‌, టూటౌన్‌ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.