ప్రధానాంశాలు

Published : 31/08/2020 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గంగూలీ టీ20ల్లో పనికొస్తాడని అనిపించలేదు.. 

దాదాలో ఆ లక్షణమే కొరవడింది: జాన్‌ బుచానన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్‌గంగూలీ ఎంత గొప్ప కెప్టెనో అందరికీ తెలిసిందే. తన దూకుడుతో భారత జట్టుకే కొత్త వన్నె తీసుకొచ్చిన సారథి అతడు. ఇక ఎంతో మంది యువకులను స్టార్‌ ఆటగాళ్లుగా తీర్చిదిద్దిన ఘనత కూడా అతడికే చెల్లింది. అలాంటి గొప్ప సారథి ఐపీఎల్‌లో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. 2008-2012 వరకు కోల్‌కతా, పుణె జట్లకు నాయకత్వం వహించిన అతడు ఒక్క టైటిల్‌ కూడా సాధించలేకపోయాడు. కాగా, ఇదే విషయంపై అప్పట్లో కేకేఆర్‌కు కోచ్‌గా వ్యవహరించిన జాన్‌బుచానన్‌ తాజాగా స్పోర్ట్స్‌స్టార్‌తో మాట్లాడుతూ గంగూలీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. దాదా టీ20 క్రికెట్‌కు పనికొస్తాడనే విషయాన్ని తాను నమ్మలేకపోయానన్నాడు. 

పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉంటే అందుకు తగ్గట్టే చురుకుగా వ్యవహరించాలి. ఏవైనా నిర్ణయాలు కూడా అంతే త్వరగా తీసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టు మారిపోవాలి. గంగూలీలో ఆ లక్షణాలు కనిపించలేదు. అందుకే అతడితో చర్చించాను. పొట్టి క్రికెట్‌కు అతడు కెప్టెన్‌గా లేదా ఆటగాడిగా కూడా పనికొస్తాడని అనిపించలేదు’ అని బుచానన్‌ పేర్కొన్నాడు. అందుకే తాను స్ల్పిట్‌ కెప్టెన్సీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చానని చెప్పాడు. ఒకే ఆటగాడికి అన్నింటిపైనా అవగాహన ఉంటుందని తాను అనుకోవట్లేదని వివరించాడు. ఈ నేపథ్యంలోనే దాదా 2008లో కేకేఆర్‌కు కెప్టెన్‌గా కొనసాగగా, తొలి సీజన్‌లో ఆ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. అనంతరం 2009లో బ్రెండన్‌ మెక్‌కలమ్‌ను కెప్టెన్‌ చెయ్యగా అప్పుడా జట్టు పూర్తిగా విఫలమైంది. మళ్లీ గంగూలీ 2010లో అదే జట్టుకు కెప్టెన్సీ చేశాడు. అనంతరం 2011, 2012 సీజన్లలో పుణె వారియర్స్‌కు నాయకత్వం వహించాడు. 

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net