ప్రధానాంశాలు

Published : 18/06/2021 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Ts News: 24 గంటల్లో 1,82,523 మందికి టీకా

హైదరాబాద్‌: తెలంగాణలో గడచిన 24గంటల్లో 1,82,523 మందికి కొవిడ్ టీకాలు అందించినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. టీకా తీసుకున్న వారిలో 4,42,813 మంది హెల్త్ కేర్ వర్కర్లు, 3,65,505 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నట్లు పేర్కొంది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 18-44 ఏళ్ల మధ్య వారు 22,44,715 మంది ఉండగా.. 45 ఏళ్లు పైబడిన వారు 56,39,228 మంది ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 881 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపింది. రాష్ట్రానికి ఇప్పటివరకు 78,09,890 కొవిడ్‌ టీకా డోసులు రాగా.. వాటిలో 77,35,358 టీకాలు వినియోగించినట్లు వెల్లడించింది.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net