
తాజా వార్తలు
హైదరాబాద్లో కరోనాతో కాంగ్రెస్ నేత మృతి
హైదరాబాద్: కరోనా మహమ్మారి సోకడంతో హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత జి. నరేంద్ర యాదవ్ మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన వివిధ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయనకు వైరస్ సోకినట్లు సమాచారం.గాంధీభవన్లో ఇటీవల జరిగిన అన్ని కార్యక్రమాల్లోనూ నరేందర్ పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
క్రమశిక్షణ గల నాయకుడిని కోల్పోయాం: కోమటిరెడ్డి
క్రమశిక్షణగల నాయకుడిని కోల్పోయామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నరేందర్యాదవ్ మృతిపట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. కరోనా నివారణ విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందడంలేదని, వాటిపై ప్రభుత్వ నియంత్రణ లేదని విమర్శించారు. ప్రజలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.