close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/02/2020 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

పిచ్‌తో కాదు.. మా తప్పుల వల్లే ఆలౌటయ్యాం

కీలక సమయాల్లో పెవిలియన్‌ చేరడం బాధాకరం: హనుమ విహారి

ముంబయి: చెత్త షాట్ల వల్లే తమ జట్టు త్వరగా ఆలౌటైందని టీమ్‌ఇండియా ఆటగాడు హనుమ విహారి (55; 70 బంతుల్లో) అన్నాడు. వాస్తవంగా పిచ్‌ అంత ప్రమాదకరంగా ఏమీ లేదని వెల్లడించాడు. కీలక సమయాల్లో వికెట్లు ఇవ్వడంతో న్యూజిలాండ్‌ పైచేయి సాధించిందని తెలిపాడు. జేమీసన్‌ ఐదు వికెట్లతో విజృంభించడంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 242కే కుప్పకూలిన సంగతి తెలిసిందే.

‘అవును, పిచ్‌ ఊహించినంత ప్రమాదకరంగా ఏమీ లేదు. న్యూజిలాండ్‌ బౌలర్లు చక్కని ప్రాంతాల్లో బంతులు వేశారు. ఈ ట్రాక్‌లో ఏం ఆశించాలో వారికి తెలుసు. పృథ్వీ శుభారంభం అందించాడు. పుజారా చాలా సమయం క్రీజులో ఉన్నాడు. కానీ అందరూ ఔటైన సమయమే సరైంది కాదు. పిచ్‌ వల్ల ఎవరూ ఔటవ్వలేదు. బ్యాట్స్‌మెన్‌ తప్పిదాలతోనే పెవిలియన్‌ చేరారు. వికెట్‌ బాగుంది’ అని విహారి అన్నాడు.

‘పుజారా ఒక ఎండ్‌లో నిలిచాడు కాబట్టి మరో ఎండ్‌ నుంచి నేను దూకుడుగా ఆడాలని అనుకున్నా. ఎందుకంటే నయావాల్‌ ఎక్కువ సమయం ఆడేందుకు తీసుకుంటాడని అందరికీ తెలుసు. అందుకే నేను కుదురుకొనేందుకు సమయం తీసుకొని అతడిపై ఒత్తిడి పెంచొద్దనుకున్నా. సానుకూలంగా పేసర్లను ఎదుర్కొన్నా. సెషన్‌ అంతా బాగా ఆడి తేనీటి విరామం ముందు నేను ఔటవ్వడం సరికాదు. అంతకుముందు మేం ఒక వికెట్‌ నష్టపోయి 110 పరుగులు చేశాం. నేను బాగా ఆడాను’ అని హనుమ తెలిపాడు.

షార్ట్‌పిచ్‌ బంతుల్ని ఆడాలన్నది తన నిర్ణయమే అని ఈ తెలుగు క్రికెటర్‌ చెప్పాడు. ‘అది నా వ్యక్తిగత నిర్ణయం. ఒక జట్టుగా మేం మరింత తీవ్రత చూపించాలనుకున్నాం. బేసిన్‌ రిజర్వ్‌ కన్నా ఈ పిచ్‌ బాగుంది. షార్ట్‌ బంతుల్ని బాది బౌలర్లపై ఒత్తిడి పెంచాలనుకున్నా. అది మాకు అనుకూలంగా సాగలేదు. భారత్‌-ఏ తరఫున ఇక్కడ నేను ఆడా. తొలి సెషన్‌ తర్వాత పిచ్‌ ప్రమాదకరంగా ఉండదని చెప్పా. మూడు రోజుల తర్వాత ఫ్లాట్‌గా మందకొడిగా మారుతుంది. అదనపు బౌన్స్‌ రాబడుతున్న జేమీసన్‌ ఐదు వికెట్ల ఘనతకు అర్హుడే’ అని హనుమ విహారి వెల్లడించాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.