అక్కడ సగం మంత్రులపై క్రిమినల్‌ కేసులు!
close

తాజా వార్తలు

Published : 18/11/2020 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్కడ సగం మంత్రులపై క్రిమినల్‌ కేసులు!

దిల్లీ: బిహార్‌లో జేడీయూ-భాజపా కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌ ఏడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా.. సోమవారం నాటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నీతీశ్‌తో పాటు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే వీరిలో ఎనిమిది మందిపై  క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. 

జేడీయూకు చెందిన ఇద్దరు, భాజపాకు చెందిన నలుగురు, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యూలర్‌) నుంచి ఒకరు, వికాస్‌శీల్‌ ఇసాన్‌ పార్టీకి చెందిన ఒక మంత్రి తనపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఎనిమిది మందిలో ఆరుగురు మంత్రులపై తీవ్రమైన కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ తెలిపింది. ఇక మొత్తం 14 మంది మంత్రుల్లో 13 మంది కోటీశ్వరులే కావడం గమనార్హం. వీరి సగటు ఆస్తుల విలువ రూ.3.93 కోట్లుగా ఉందని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది. తారాపూర్‌ నుంచి గెలిచిన మంత్రి మేవాలాల్‌ చౌధరికి అత్యధికంగా రూ.12.31కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక మంత్రుల్లో నలుగురి విద్యార్హత 8 నుంచి 12వ తరగతి మధ్యే ఉంది. మిగతా 10 మంది తాము గ్రాడ్యుయేట్లమని పేర్కొన్నారు. 

విద్యామంత్రిపై వివాదం

ఇదిలా ఉండగా.. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న జేడీయూ నేత మేవాలాల్‌ చౌధరికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగించడం వివాదాస్పందగా మారింది. ఆయనను వెంటనే విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్ష ఆర్జేడీ డిమాండ్‌ చేస్తోంది. అవినీతి ఆరోపణలు, క్రిమినల్‌ కేసులు ఉన్న వ్యక్తికి కీలకమైన విద్యాశాఖ ఎలా ఇస్తారని ఆర్జేడీ ప్రశ్నించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని