close
Array ( ) 1

తాజా వార్తలు

వలస కూలీలను ఆదుకోండి: వెంకయ్యనాయుడు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతమవుతున్న నేపథ్యంలో వివిధ చోట్ల చిక్కుకుపోయిన వలస కూలీలను ఆదుకోవాలని స్వచ్ఛంద, సామాజిక సంస్థలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడికీ వెళ్లలేక.. కనీస భోజన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వెంకయ్యనాయుడు స్పందించారు. వలస కార్మికుల విషయంలోనూ స్థానికులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారికి కూడు, గూడు కల్పించి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్, కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా తదితరులతో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వలస కార్మికుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు పీఎం-కేర్స్ సహాయ నిధికి ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఇప్పటికే పలువురు వ్యక్తిగతంగా, మరికొన్ని కార్పొరేట్ సంస్థలు, వివిధ రంగాల ప్రతినిధులు స్వచ్ఛందంగా ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించడాన్ని ఉపరాష్ట్రపతి స్వాగతించారు. 
‘కలిసి జీవించడం, కష్టసుఖాలను పంచుకోవడం భారతీయ సంప్రదాయానికి మూలం. నేడు కరోనా కారణంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి మీరు చేయగలిగిన సహాయం చేయండి. దీన్ని మీ బాధ్యతగా గుర్తుంచుకోండి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 
ఇళ్లలోనూ సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాను తరిమివేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.