close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 21/03/2020 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాట్సాప్‌లో కరోనా హెల్ప్‌ అలర్ట్‌...

ఎటు చూసినా కరోనా...కరోనా... ఈ కొవిడ్‌-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని గురించి ఒక్కో దగ్గర ఒక్కో రకమైన సమాచారం ఉంది. మరి కచ్చితమైన, విశ్వసనీయ సమాచారం కావాలంటే?... అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) శనివారం వాట్సాప్‌లో హెల్త్ అలర్ట్ ప్రారంభించింది. 

డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ అలర్ట్ అనేది వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చిన తాజా అధికారిక ఎన్జీవో లేదా ప్రభుత్వ హెల్ప్‌లైన్. ఇందులో 150 కోట్లకు పైగా వినియోగదారులు ప్రశ్నలు అడగవచ్చు. అడిగిన వారికి ఈ వైరస్‌కు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని అందిస్తారు. ఇది 24/7 పనిచేస్తుంది. ఇందులో కరోనా నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? ప్రయాణాలు చేయాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ కొత్త వైరస్‌కి సంబంధించిన వివిధ అంశాలపై అధికారిక సమాచారాన్ని అందిస్తుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తారు. ఇప్పటికే ఈ గ్రూపులో సింగపూర్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ, ఇండోనేషియాలోని కోమిన్‌ఫో చేరాయి.

ప్రస్తుతం దీన్ని ఆంగ్లంలో ప్రారంభించారు. కొన్ని వారాల్లో మొత్తం ఆరు భాషలలో (ఇంగ్లీష్, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్) అందుబాటులోకి తీసుకురానుంది. 

డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ అలర్ట్‌ను సంప్రదించడానికి, మీ ఫోనులో 41 79 893 1892 నంబర్‌ను సేవ్ చేసి, ఆపై ప్రారంభించడానికి వాట్సాప్ సందేశంలో ‘హాయ్’ అనే పదాన్ని టెక్స్ట్ చేయండి. వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ అలర్ట్‌తో సందేశాలు పంపడానికి హోమ్‌పేజీలోని డబ్ల్యూహెచ్‌ఓ లింక్‌పై క్లిక్ చేయండి. వాట్సాప్‌ లేకపోతే  వాట్సాప్.కామ్ / కోరోనావైరస్ అనే లింక్‌ ద్వారా వాట్సాప్ కరోనావైరస్ ఇన్ఫర్మేషన్ హబ్‌లోనూ చూడొచ్చు.

‘‘ముఖ్యమైన ఆరోగ్య సమాచారం కోట్ల మంది ప్రజలను చేరుకోవడంలో మాకు సహకరిస్తున్న ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి భాగస్వాములను కలిగి ఉండటం మాకు గర్వంగా ఉంది’ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అన్నారు. ఈ వారం ప్రారంభంలో, వాట్సాప్ భాగస్వామ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, యూఎన్‌డీపీలు కలిసి వాట్సాప్ కరోనావైరస్ ఇన్ఫర్మేషన్ హబ్‌ను ప్రారంభించాయి. ఈ హబ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సమాచారాన్ని అందించనున్నారు. ఇది కచ్చితమైన ఆరోగ్య సమాచారం అందరికీ అందించడానికి, పుకార్ల వ్యాప్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.