బలగాల ఉపసంహరణకు ఇరుపక్షాలు ఓకే
close

తాజా వార్తలు

Published : 16/07/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బలగాల ఉపసంహరణకు ఇరుపక్షాలు ఓకే

ప్రకటించిన భారత సైన్యం

న్యూదిల్లీ: భారత్‌ - చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను పూర్తిగా తగ్గించేందుకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండేందుకు అంగీకరించాయని భారత సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాలకు చెందిన సీనియర్‌ సైనికాధికారులు జులై 14న  నాలుగో విడత చర్చలను చుషూల్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే.  వీరు ఇప్పటికే ఉద్రిక్తతలను చల్చార్చేందుకు తొలిఅడుగులో భాగంగా తీసుకొన్న చర్యలను సమీక్షించారు.  తర్వాత పూర్తిస్థాయిలో బలగాల విరమణపై కూడా చర్చించారు.  ఈ లక్ష్యాన్ని సాధించేందుకు క్రమం తప్పకుండా ఇరు దేశాల అధికారుల సమావేశాలు జరగాలని అభిప్రాయపడ్డారు.  దీనికోసం దౌత్య, సైనిక స్థాయి అధికారుల భేటీలను నిర్వహించాలని నిర్ణయించారు. 

జూన్‌లో ఘర్షణ చోటు చేసుకొన్న పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 నుంచి ఇప్పటికే ఇరు బలగాలు రెండేసి కిలోమీటర్లు చొప్పున వెనక్కి తగ్గాయి. దీంతోపాటు గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతాల్లో వెనక్కి తగ్గుతున్నాయి.  వీటిపై గతవారం భారత ఎన్‌ఎస్‌ఏ , చైనా విదేశాంగశాఖ మంత్రి చర్చలు జరిపారు.  దీంతో పాంగాంగ్‌సో సరస్సుపై పూర్తిగా దృష్టిపెట్టారు. ఫింగర్‌4 నుంచి చైనా బలగాలను ఫింగర్‌ 8 వద్దకు పంపడం కొంచెం కష్టమే.  ఇప్పటికైతే చైనా దళాలు ఫింగర్‌4 నుంచి 5 వరకు వెనక్కి తగ్గొచ్చు.  భారత్‌ కూడా ఫింగర్ 3 వరకు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. దీనికోసం భారత్‌ కూడా కొంత భాగం వెనక్కి రావాల్సి ఉంటుంది.  అసలు తొలి ఘర్షణ జరిగింది ఇక్కడే కావడం గమనార్హం. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని