రఘునందన్ అభ్యర్థిత్వాన్ని రద్దుచేయండి:కాంగ్రెస్‌
close

తాజా వార్తలు

Published : 03/11/2020 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రఘునందన్ అభ్యర్థిత్వాన్ని రద్దుచేయండి:కాంగ్రెస్‌

ఈసీకి లేఖ రాసిన మర్రి శశిధర్‌రెడ్డి

హైదరాబాద్‌: దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ లేఖ రాసింది. భాజపా అభ్యర్థికి సంబంధించి రెండు సార్లు భారీ మొత్తంలో నగదు పట్టుబడిన విషయాలను వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌ రెడ్డి తెలిపారు. పోలింగ్‌కు ముందు రోజు కావడంతో దుబ్బాక నియోజకవర్గంలోని 146 గ్రామాల్లో భారీగా నగదు, మద్యం పంపిణీ జరిగే అవకాశాలున్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. 

తెరాస, భాజపా రెండూ భారీగా మద్యం, నగదు పంపిణీ చేస్తున్నాయని మర్రి శశిధర్‌ రెడ్డి ఆరోపించారు. కలెక్టర్‌ బదిలీ, పోలీసు పరిశీలకుల నియామకం జరిగినప్పటికీ నగదు, మద్యం పంపిణీ నిరాటంకంగా కొనసాగుతోందన్నారు. స్థానిక పోలీసులు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే తనిఖీలు నిర్వహిస్తున్నారని.. తెరాస పార్టీకి చెందిన వారిని తనిఖీ చేయడంలేదన్నారు. అన్ని వాహనాలనూ తనిఖీ చేసేందుకు పోలీసు బలగాలను ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు శశిధర్‌రెడ్డి వివరించారు. తక్షణమే మద్యం దుకాణాలు, బార్లను మూసివేసేట్టు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని