చిరు బర్త్‌డే కామన్‌ డీపీ: ప్రత్యేకత ఏంటో తెలుసా?
close

తాజా వార్తలు

Published : 22/08/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు బర్త్‌డే కామన్‌ డీపీ: ప్రత్యేకత ఏంటో తెలుసా?

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు, సందేశాలు, ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన పోస్టర్లను అభిమానులు పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌.. చిరంజీవి పుట్టినరోజు కామన్‌ డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌)ని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. చిరంజీవి కెరీర్‌ను ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దారు.

ఇందులో చిరు నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లోని పాత్రలను ఒక్కో మెట్టుపై ఉంచారు. ‘ఖైదీ’, ‘పసివాడి ప్రాణం’, ‘స్వయంకృషి’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ఘరానా మొగుడు’, ‘ఇంద్ర’, ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాల్లో పాత్రలను ఒక్కో మెట్టుపై నిలబెడుతూ చూపించారు. మెగాస్టార్‌ టైటిల్‌లో ‘సైరా: నరసింహారెడ్డి’ పాత్రను ఉంచారు. చిరంజీవి కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరమై.. రాజకీయాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఆ కాలాన్ని కూడా ఈ డీపీలో చూపించడం విశేషం. ‘ఇంద్ర’-‘ఖైదీ నంబర్‌ 150’ పాత్రల మధ్యలో కొంత భాగం ఫ్లాట్‌గా రాళ్లు, మొక్కలు ఉన్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

దీంతో పాటు, చిరు బర్త్‌డే మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఒకేసారి 100 మంది సినీ నటులు, వీరాభిమానులు దీన్ని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేయడం విశేషం.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని