close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఏపీలో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటు

రాష్ట్రంలో కొత్తగా మరో శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం’ పేరిట కొత్త పాలనశాఖ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ల అంశంతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అంశాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

2. హ్యాట్సాఫ్‌ టు కేసీఆర్‌: జగన్‌

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన దిశ హత్యోదంతం.. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దిశ ద్విచక్రవాహనాన్ని పంక్చర్‌ చేసిన నలుగురు నిందితులు ఆమెను కిరాతకంగా హతమార్చారని ఆవేదన వ్యక్తంచేశారు. దిశ హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ పోలీసు అధికారులకు చట్టసభ వేదికగా జగన్‌ హ్యాట్సాఫ్ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

3. విద్యారుణాల మాఫీ ప్రతిపాదనేదీ లేదు

ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలను మాఫీ చేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల గణాంకాల ప్రకారం.. 2016-17 నుంచి 2019 మార్చి వరకు ఎడ్యుకేషన్‌ లోన్‌లు రూ. 67,685.59 కోట్ల నుంచి రూ. 75,450.68కోట్లకు పెరిగాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

4. కేసీఆర్‌ విధానాల వల్లే రాష్ట్రం దివాలా:లక్ష్మణ్‌

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్వేత పత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నుంచి బకాయిల తెలంగాణగా మార్చారని ఆయన ధ్వజమెత్తారు.  ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. కేసీఆర్‌ చేతిలో సంపన్న రాష్ట్రం పెడితే ఆయన అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. కేసీఆర్‌ విధానాల వల్లనే రాష్ట్రం దివాలా తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

5. రష్యాపై వాడా వేటు: 4 ఏళ్లు నిషేధం

2020 టోక్యో ఒలింపిక్స్‌, 2022 వింటర్‌ ఒలింపిక్స్‌ సహా మరే ప్రపంచపోటీల్లో పాల్గొనకుండా రష్యాపై వేటుపడింది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా నాలుగేళ్లు నిషేధం విధించాలన్న సమీక్ష కమిటీ ప్రతిపాదనను ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంఘం (వాడా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. డోపింగ్‌ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మాస్కో ప్రయోగశాలకు సంబంధించి తప్పుడు వివరాలను ఇవ్వడమే ఇందుకు కారణం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

6. మానవాభివృద్ధి సూచీలో మన ర్యాంకు 129

ఐక్యరాజ్యసమితి సోమవారం విడుదల చేసిన 2019 మానవాభివృద్ధి సూచీలో భారత్‌ కాస్త మెరుగుపడి ఒక స్థానం పైకి ఎగబాకింది. 2018 సంవత్సరంలో భారత్‌ 0.647 మానవాభివృద్ధి విలువతో 130వ ర్యాంకులో ఉండగా.. ప్రస్తుతం ఒక మెట్టు పైకెక్కి 189 దేశాలకు గానూ 129వ స్థానంలో నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఉల్లిపై తెదేపాది అనవసర రాద్ధాంతం:మోపిదేవి

ఉల్లిధరలపై తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోందని ఏపీ మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉల్లి సరఫరా తగ్గిపోయి ధరలు ఆకాశాన్నంటాయని.. అకాల వర్షాల కారణంగా పంట చేతికి రాక ఇబ్బందులు ఎదురవుతుంటే ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద మోపిదేవి మీడియాతో మాట్లాడారు. ఉల్లి ధరల విషయంలో తొలిసారిగా స్పందించి రాయితీపై విక్రయిస్తున్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఎస్సై, కానిస్టేబుల్‌ను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ సమయంలో గాయపడిన ఎస్సై, కానిస్టేబుల్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) బృందం విచారించింది. గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌గౌడ్‌లను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు ప్రశ్నించారు. వివిధ అంశాలపై వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌కు సింధు ఎంపిక

డిసెంబర్‌ 11 నుంచి చైనాలో జరిగే బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ 2019లో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు అతికష్టం మీద చోటు దక్కించుకుంది. చైనా క్రీడాకారిణులు చెన్‌ యుఫీ, హీ బింగ్జియో, జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచిలతో కలిసి గ్రూప్‌ ఏలో స్థానం సంపాదించింది. బుధవారం తొలి మ్యాచ్‌లో యమగుచితో తలపడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. యమహా సరికొత్త వైజెడ్‌ఎఫ్‌ ఆర్‌15 విడుదల

యమహా సరికొత్త మోటార్‌ సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్‌6 నిబంధనలకు అనుగుణంగా తయారు చేసిన వైజెడ్‌ఎఫ్‌ ఆర్‌15 వీ3.0ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.45లక్షలుగా నిర్ణయించింది. బీఎస్‌4 వెర్షన్‌తో పోల్చుకొంటే సరికొత్త బైకు రూ.2,000 ధర ఎక్కువ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యమహా డీలర్ల వద్ద ఇది అందుబాటులో ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.