
తాజా వార్తలు
తెలంగాణలో కొత్తగా 51 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ కొత్తగా 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నమోదైనవాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 37 కేసులు నిర్ధారణ కాగా.. మరో 14 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,326కి చేరింది. ఇవాళ కరోనా బారినుంచి 21 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 822కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈరోజు కరోనాతో ఇద్దరు మృతి చెందడంతో మొత్తంగా 32 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 472 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
Tags :
జిల్లా వార్తలు