వధూవరులతో సహా 100 మంది క్వారెంటైన్‌
close

తాజా వార్తలు

Published : 28/05/2020 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వధూవరులతో సహా 100 మంది క్వారెంటైన్‌

వధువు బంధువుకు కరోనా సోకడంతో..

భోపాల్‌: పెళ్లైన కొద్ది గంటల్లోనే వధూవరులతో సహా సుమారు 100 మంది బంధుమిత్రులను క్వారెంటైన్‌కు తరలించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వధువు బంధువుకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతోనే వారిని ప్రభుత్వ క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలించామని జిల్లా అధికారి వెల్లడించారు. వివరాల్లోకెళితే.. వధువు బంధువు ఒకరు సెంట్రల్‌ ఇండిస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌)లో విధులు నిర్వర్తిస్తున్నారు. గతవారం ఆయన ఛింద్వారా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న తన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అతను జిల్లా సరిహద్దుల్లో ప్రవేశిస్తుండగా అధికారులు స్క్రీనింగ్‌ పరీక్షలు జరిపి అనుమతించారు. 

ఇంటికి వచ్చాక అతను ఇతర ప్రాంతాల్లోని కొందరు బంధువులను కలిశారు. అలాగే మే 26న ఛింద్వారాలో జరిగిన తన మరదలి పెళ్లికి హాజరయ్యారు. అయితే, కొద్దిరోజులుగా అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేశామని, వైరస్‌ సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయిందని కలెక్టర్‌ సౌరభ్‌ సుమన్‌ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో తొలుత.. అతను కలిసిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తిస్తున్నామని తెలిపారు. అతను కలిసిన వారు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు నిర్ధారించుకున్నామన్నారు. ఆ వ్యక్తి తన మరదలి పెళ్లికి హాజరవ్వడంతో నూతన వధువరులతో సహా మొత్తం కుటుంబసభ్యులను, పెళ్లికి హాజరైన వారిని మూడు ప్రభుత్వ క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలించామని తెలిపారు. తర్వాత అతనిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెల్లడించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని