close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 21/05/2020 23:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాక్‌డౌన్‌వేళ పేటీఎం హవా

దిల్లీ: రిటైల్‌ వ్యాపారుల కోసం బిజినెస్‌ ఖాతా పేరుతో పేటీఎం తీసుకొచ్చిన ఈ-లెడ్జర్‌ సర్వీస్‌ లాక్‌డౌన్‌వేళ దూసుకుపోతోంది. సుమారు రూ.1500 కోట్ల విలువగల చెల్లింపులు వినియోగదారుల నుంచి వ్యాపారులకు వచ్చినట్టు ఆ సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు గురువారం తెలిపారు. 2020 జనవరిలో తీసుకొచ్చిన ఈ సర్వీస్‌లో ఆ నెల 8 నుంచి మార్చి 14 వరకు వచ్చిన చెల్లింపులతో పోలిస్తే లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు రెట్లు అధికంగా జరిగినట్లు తెలిపారు.

ఈ బిజినెస్‌ ఖాతాను కిరాణా దుకాణదారులు, మధ్యస్థాయి ఆటోమొబైల్‌ వ్యాపారులు ఎక్కువగా వాడుతున్నారు. సాధారణంగా వినియోగదారులు ఈ తరహా వ్యాపారుల నుంచి సరకును అరువుపై తీసుకెళ్తారు. ఆ లావాదేవీలను వ్యాపారులు బిజినెస్‌ ఖాతాలో నమోదు చేసుకుంటారు. గడువు ముగియగానే వినియోగదారులకు సందేశం రూపంలో రిమైండర్‌ వెళ్తుంది. దీంతో ప్రత్యేకంగా గుర్తుచేసే పనిలేకుండా వ్యాపారులు సులభంగా వసూళ్లు చేసుకోగలుగుతున్నారు. ప్రస్తుతం 10 లక్షలకు పైగా వ్యాపారులు ఈ సేవను వినియోగిస్తున్నారని పేటీఎం తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.